హిందీ డెబ్యూ కోసం జిమ్ లో కసరత్తులు చేస్తోన్న నాగ చైతన్య

హిందీ డెబ్యూ కోసం జిమ్ లో కసరత్తులు చేస్తోన్న నాగ చైతన్య
హిందీ డెబ్యూ కోసం జిమ్ లో కసరత్తులు చేస్తోన్న నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య కెరీర్ ప్రస్తుతం మంచి ఊపుమీదుంది. వరసగా రెండు హిట్స్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ చేసాడు చైతన్య. ఈ చిత్రంలో పక్కింటి కుర్రాడి పాత్రలో కనిపిస్తాడు. ఒక సింపుల్ మధ్య తరగతి లవ్ స్టోరీని శేఖర్ ప్రెజంట్ చేయబోతున్నాడు. ఇక విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేస్తోన్న థాంక్యూ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది.

నాగ చైతన్య ఈ ఏడాది హిందీ డెబ్యూ చేస్తోన్న విషయం తెల్సిందే. ఆమిర్ ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ చద్దా చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తాడు చైతన్య. ఈ చిత్రంలో ఆర్మీ అధికారి పాత్రను పోషిస్తున్నాడు. ఇందుకోసం ఫిట్ గా ఉండాలి.

అందుకోసమే రోజూ జిమ్ లో గంటల తరబడి కసరత్తులు చేస్తున్నాడు. అతని ట్రైనర్ సమక్షంలో నాగ చైతన్య కష్టపడుతోన్న వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. కండలు తిరిగిన దేహంతో చైతన్య అలరించనున్నాడు. త్వరలోనే హిందీ సినిమా షూటింగ్ మొదలుకానుంది.