షాట్ మ‌ధ్య‌లో హీరో హీరోయిన్‌ సెల్ఫీ!

షాట్ మ‌ధ్య‌లో హీరో హీరోయిన్‌ సెల్ఫీ!
షాట్ మ‌ధ్య‌లో హీరో హీరోయిన్‌ సెల్ఫీ!

అభిమాన హీరో క‌నిపిస్తే సెల్ఫీ కోసం అభిమానులు ఎగ‌బ‌డుతుంటారు. అదే హీరో.. హీరోయిన్‌తో సెల్ఫీ దిగితే.. ఆ సెల్ఫీ ఫొటోని హీయిన్ ఇన్ స్టాలో పోస్ట్ చేస్తే ఇంకేముందు నెట్టింట వైర‌ల్ కావాల్సిందే. ఇప్పుడు ఓ క్రేజీ హీరో, హీరోయిన్‌తో క‌లిసి సెల్ఫీకి పోజులిచ్చిన ఫొటో ఇదే త‌ర‌హాలో వైర‌ల్‌గా మారింది. ఆ హీరో మ‌రెవ‌రో కాదు నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా.

వివ‌రాల్లోకి వెళితే.. అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన చిత్రం `ల‌వ్ స్టోరీ` రిలీజ్‌కి సిద్ధంగా వుంది. దీని త‌రువాత చైత‌న్య వెంట‌నే మ‌రో చిత్రాన్ని స్టార్ట్ చేసిన విష‌యం తెలిసిందే. విక్ర‌మ్ కె. కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `థ్యాంక్యూ` అనే టైటిల్‌ని ఖ‌రారు చేసిన విష‌యం తెలిసిందే.

ఈ చిత్రంలో చై సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌కు వీరాభిమానిగా క‌నిపించ‌బోతున్నారు. మ‌హేష్ క‌టౌట్‌కి చై పాలాభి షేకం చేస్తున్న ఓ వీడియో ఇటీవ‌ల సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే.  ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇటీవ‌ల యూర‌ప్‌లో జ‌రిగింది. ఈ మూవీ షాట్ గ్యాప్‌లో రాశీతో క‌లిసి నాగ‌చైత‌న్య సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోని రాశీఖ‌న్నా త‌న ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీనికి `షూటింగ్ గ్యాప్ మ‌ధ్య‌..` అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. దీంతో ఈ ఫొటో నెట్టింట సంద‌డి చేస్తోంది.