మహానటిలో నటించకపోతే జీవితాంతం బాధపడేవాడట


naga chaitanya talks about portraying his grandfather ANR in mahanatiమహానటి చిత్రంలో తాతగారి పాత్ర నేను పోషించలేకపొతే జీవితాంతం బాధపడుతూనే ఉండేవాడినని అంటున్నాడు హీరో నాగచైతన్య . నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి చిత్రంలో నాగచైతన్య అక్కినేని నాగేశ్వర్ రావు పాత్ర పోషించిన విషయం తెలిసిందే . పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఆ పాత్ర ప్రభావం ఎక్కువే ! తాతయ్య పాత్ర ని పోషించాలని దర్శకుడు నాగ్ అశ్విన్ చైతూ ని సంప్రదించినప్పుడు ఆ పాత్రని చేయగలనా అని భయపడ్డాడట .

అందుకే నాన్న నాగార్జున పేరు చెప్పి నేను మహానటి లో నటించలేను అని చెప్పాలనుకున్నాడట చైతూ . కానీ నాగ్ అశ్విన్ పట్టుబట్టి నువ్వు చేయగలవు అంటూ ప్రోత్సహించాడట అంతేకాదు ఎన్ని టేక్ లు తీసుకున్నా ఫరవాలేదు అంటూ బెటర్ మెంట్ కోసం ప్రయత్నించాడట నాగ్ అశ్విన్ . ఇక నాగచైతన్య ఆ పాత్ర కోసం ఎంత కష్టమైనా పడాల్సిందే అని ఫిక్స్ అయి చేసాడట కట్ చేస్తే ….. మహానటి చిత్రానికి వస్తున్న ప్రశంసలు చూసి షాక్ అవుతున్నాడు చైతూ . ఇంత గొప్ప చిత్రంలో తాతయ్య పాత్ర ని నేను కాకుండా మరొకరు చేసి ఉంటే చాలా ఫీలయ్యేవాడిని అంటున్నాడు నాగచైతన్య .