తరుణ్ భాస్కర్ చిత్రాన్ని ఓకే చేసిన నాగ చైతన్య

తరుణ్ భాస్కర్ చిత్రాన్ని ఓకే చేసిన నాగ చైతన్య
తరుణ్ భాస్కర్ చిత్రాన్ని ఓకే చేసిన నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం సూపర్ బిజీగా ఉన్నాడు. లవ్ స్టోరీ తర్వాత థాంక్యూ చిత్రాన్ని మొదలుపెట్టిన చైతన్య మెజారిటీ భాగాన్ని పూర్తి చేసాడు. అలాగే ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం లాల్ సింగ్ చద్దా చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ వారంతో తన పాత్ర చిత్రీకరణ పూర్తి చేసుకుంటాడు. తిరిగి వచ్చిన తర్వాత థాంక్యూ సినిమాను పూర్తి చేస్తాడు.

ఆ తర్వాత నాగార్జున నటించే బంగార్రాజు చిత్రంపై ఫోకస్ పెడతాడు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే చైతన్య తన నెక్స్ట్ సినిమాను కూడా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చైతన్య నటించనున్నాడు.

సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత తరుణ్ భాస్కర్ మరో సినిమాను మొదలుపెడతాడు. ముందుగా వెంకటేష్ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తాడని అన్నారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు.