ప్రొడ్యూస‌ర్‌గా మారుతున్న నాగ‌చైత‌న్య‌?


ప్రొడ్యూస‌ర్‌గా మారుతున్న నాగ‌చైత‌న్య‌?
ప్రొడ్యూస‌ర్‌గా మారుతున్న నాగ‌చైత‌న్య‌?

`మ‌జిలి` నుంచి విభిన్న‌మైన చిత్రాల్ని ఎంచుకుంటున్నారు హీరో నాగ‌చైత‌న్య‌. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `ల‌వ్‌స్టోరి`. శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇదిలా వుంటే నాగ‌చైత‌న్య ప్రొడ్యూస‌ర్‌గా మారుతున్న‌ట్టు తెలిసింది. సొంతంగా ఓ నూత‌న నిర్మాణ సంస్థ‌ని స్థాపించి యంగ్ హీరోతో సినిమా చేయాల‌నుకుంటున్నార‌ట‌.

ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించ‌నున్న‌ట్టు తెలిసింది. ఈ చిత్రం కోసం అవికా గోర్ హీరోయిన్‌గా సంప్ర‌దించార‌ట‌. ఈ చిత్రానికి శ్రీ‌నివాస్ గ‌విరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ట‌. గ‌తంలో శ్రీ‌నివాస్ గ‌విరెడ్డి `సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు` చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఆ త‌రువాత మ‌రో సినిమా చేయ‌లేదు. ఇన్నాళ్లకు మ‌ళ్లీ అత‌నికి ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం వ‌చ్చిన‌ట్టు తెలిసింది.

అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో రాజ్ త‌రుణ్ `ఉయ్యాల జంపాల‌` చేసిన విష‌యం తెలిసిందే. ఆ సినిమా మంచి విజ‌యాన్ని సాధించి హీరోగా రాజ్ త‌రుణ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. నాగ‌చైత‌న్య చేయ‌బోతున్న సినిమాతో రాజ్ త‌రుణ్ కెరీర్ మ‌రో మ‌లుపు తిరుగుతుందేమో చూడాలి.