నాగ‌శౌర్య హీరోగా మ‌హేష్ కోనేరు చిత్రం షురూ!


నాగ‌శౌర్య హీరోగా మ‌హేష్ కోనేరు చిత్రం షురూ!
నాగ‌శౌర్య హీరోగా మ‌హేష్ కోనేరు చిత్రం షురూ!

`అశ్వ‌థ్థామ‌` చిత్రంతో మాస్ హీరోగా నిరూపించుకోవాల‌నుకున్నారు నాగ‌శైర్య‌. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రం త‌ర‌వాత ఆయ‌న హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.4గా యువ నిర్మాత మ‌హేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ‌శౌర్య కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రంగా తెర‌పైకి రాబోతున్న ఈ చిత్రం శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ చిత్రం ద్వారా కె.పి. రాజేంద్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

ముహూర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ నివ్వ‌గా, హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ కెమెరా స్విఛాన్ చేశారు. ద‌ర్శ‌కులు హ‌రీష్‌శంక‌ర్‌, వి.ఐ. ఆనంద్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనంత‌రం హీరో క‌ల్యాణ్‌రామ్ స్క్రిప్ట్‌ని ద‌ర్శ‌కుడు కె.పి. రాజేంద్ర‌కు అంద‌జేశారు. `హీరో నాగ‌శౌర్య కెరీర్‌లోనే వ‌న్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం వుంబోతోంద‌ని, ద‌ర్శ‌కుడు రాజా మంచి ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని రెడీ చేశాడు. మార్చిలో షూటింగ్ ప్రారంభించి ఈ ఏడాది సెకండ్ హాఫ్‌లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నామ‌ని, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని త్వ‌ర‌లో తెలియ‌జేస్తామ‌ని నిర్మాత మ‌హేష్ కోనేరు వెల్ల‌డించారు.

మంచి ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఈ సినిమాతో స‌రికొత్త నాగ‌శౌర్య‌ని చూస్తార‌ని, మార్చి తొలి వారంలో ఫ‌స్ట్ షెడ్యూల్ యొద‌ల‌వుతుందని, ఈ చిత్రానికి కెమెరా స‌మీర్‌రెడ్డి, ఎడిటింగ్ చోటా కె, ప్ర‌సాద్, సంగీతం సాగ‌ర్ మ‌హతి అందిస్తున్నార‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు.