నాగ‌శౌర్య సినిమాపై నిర్మాత క్లారిటీ!


నాగ‌శౌర్య సినిమాపై నిర్మాత క్లారిటీ!
నాగ‌శౌర్య సినిమాపై నిర్మాత క్లారిటీ!

ఒక సినిమా అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్‌లో వుండ‌గానే అది ఆగిపోయిందంటూ ఈ మ‌ధ్య వ‌రుస పుకార్లు కామ‌న్ అయిసోయాయి. ఇదే త‌ర‌హా పుకార్లు గ‌త కొన్ని రోజులుగా యంగ్ హీరో నాగ‌శౌర్య సినిమాపై కూడా వినిపిస్తున్నాయి. నాగ‌శౌర్య రీసెంట్‌గా న‌టించిన `అశ్వ‌థ్థామ‌` ఆశించిన స్థాయిలో ఆడ‌క‌పోవ‌డంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ నాగ‌శౌర్య త‌ను శ్రీ‌న‌వాస్ అవ‌స‌రాల‌తో చేస్తున్న చిత్రాన్ని మ‌ధ్య‌లోనే ఆపేశాడ‌ని, దాంతో ఆ సినిమా పూర్తిగా ఆగిపోయిన‌ట్టేన‌ని వార్త‌లు జోరుగా వినిపించాయి.

అయితే ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని తాజాగా తెలిసింది. తాజా పుకార్ల‌పై చిత్ర నిర్మాత‌తో పాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వివ‌ర‌ణ ఇచ్చారు. శ్రీ‌నివాస్ అవ‌స‌రాల ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌శౌర్య హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ ఓ చిత్రాన్ని ఇటీవ‌లే ప్రారంభించారు. కొంత వ‌ర‌కు షూటింగ్ జ‌రిగిన ఈ చిత్రాన్ని ఆపేశార‌నే ప్ర‌చారంలో అర్థం లేద‌ని, అదంతా వ‌ట్టి పుకారు మాత్ర‌మేన‌ని నిర్మాత బుధ‌వారం వెల్ల‌డించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్ ఈ సినిమా 50 శాంతం పూర్త‌యింద‌ని, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల చాలా సంతృప్తిక‌రంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని, మిగ‌తా భాగాన్ని యుఎస్‌లో పూర్తి చేయాల‌ని ప్లాన్ చేశామ‌ని, అయితే అక్క‌డ షూటింగ్‌కు అనుమ‌తులు రాలేద‌ని, వ‌చ్చిన వెంట‌నే కీల‌క ఘ‌ట్టాల్ని అక్క‌డ షూటింగ్ చేస్తామ‌ని వివేక్ కూచీభోట్ల సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా స్ప‌ష్టం చేశారు.