తప్పు దర్శకుడి మీద నెట్టడం కరెక్టేనా హీరో !


Naga Shaurya
Naga Shaurya

హిట్ అయితే పొగడటం లేదంటే క్రెడిట్ మొత్తం కొట్టేయడం …….. ప్లాప్ వస్తే విమర్శించడం కామన్ అయిపొయింది . ఈ లిస్ట్ లోకి యంగ్ హీరో నాగశౌర్య కూడా చేరాడు . ఛలో వంటి సూపర్ హిట్ తర్వాత ” నర్తనశాల ” అనే చిత్రం చేసాడు . అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది దాంతో ఆ తప్పు మొత్తం దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి  మీద వేసాడు ఈ హీరో . ఇటీవలే మరో కొత్త సినిమా ప్రారంభించాడు ఈ హీరో తన సొంత సంస్థలో .

అయితే నర్తనశాల ప్లాప్ కావడానికి దర్శకుడు కారణం అంటూ చెప్పడం మరీ దారుణం . ఆ సినిమా కథ విని , ఒప్పుకొని చేసాడు పైగా తానే నిర్మించాడు కూడా . కానీ ప్లాప్ అయ్యేసరికి దర్శకుడి మీద నిండా వేయడం శోచనీయం . ఛలో తర్వాత బోలెడు కథలు విని నర్తనశాల ని ఎంపిక చేసుకున్నాడు . అయితే ఈసారి మాత్రం ఆ తప్పు చేయడం లేదని అంటున్నాడు నాగశౌర్య . తప్పకుండా ప్రేక్షకులను అలరించే కథతో వస్తున్నాను …. హిట్ కొడుతున్నాను అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు మరి .