అశ్వధాముడు వేరే హీరోలకూ పెన్ను పడతాడట

అశ్వధాముడు వేరే హీరోలకూ పెన్ను పడతాడట
అశ్వధాముడు వేరే హీరోలకూ పెన్ను పడతాడట

యంగ్ హీరో నాగ శౌర్య తాను నమ్మిన కథ కోసం నిర్మాతగా మారాడు. ఛలో కథలో విషయముందని పసిగట్టిన నాగ శౌర్య ఐరా క్రియేషన్స్ ను స్థాపించి ఆ సినిమాను నిర్మించాడు. అది ఎంత పెద్ద హిట్టయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. తన కెరీర్ ను ఛలోకు ముందు, ఛలో తర్వాత అని విభజించుకునే తరహాలో ఛలో విజయం సాధించింది. అయితే ఆ తర్వాత తన బ్యానర్ లోనే నర్తనశాల సినిమాను నిర్మించాడు కానీ కథ విషయంలో తన జడ్జిమెంట్ తప్పింది. అయితే తాను ఎదురుచూస్తుంటే మంచి కథలు రావట్లేదని తానే పెన్ను పట్టి నిజంగా జరిగిన సంఘటనల నుండి ఇన్స్పైర్ అయ్యి అశ్వథామ కథను రాసుకున్నాడు. ఈ సినిమాపై నాగ శౌర్య ఎక్కడలేని కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఈ సినిమా విజయం సాధించడం తధ్యమని అంటున్నాడు.

ఇదిలా ఉంటే నాగ శౌర్య పెన్ను పట్టడం కేవలం ఈ ఒక్క సినిమాతోనే సరిపెట్టడట. ఇకపై తాను రెగ్యులర్ గా కథలు రాస్తా అంటున్నాడు. తన దగ్గర చాలానే కథలు ఉన్నాయిట. అయితే తన సినిమాలకే కాకుండా వేరే హీరోల సినిమాలకు కూడా కథలు రాసి తన బ్యానర్ లోనే నిర్మిస్తానని చెబుతున్నాడు. నిజానికి నాగ శౌర్యతో సినిమాలు నిర్మించడానికి బయట నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. కథలకు కూడా లోటు లేదు అయితే శౌర్య మాత్రం తన అదృష్టాన్ని తానే రాసుకుంటానని చెబుతున్నాడు.

అశ్వథామ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. విభిన్న సినిమా అన్న ఫీలింగ్ కలిగించింది. యాక్షన్ సన్నివేశాలు, సెంటిమెంట్ హైలైట్ గా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు రమణ తేజ తెరకెక్కించాడు. శ్రీ చరణ్ పాకల ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. జనవరి 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి అశ్వథామ హిట్ అయితేనే నాగ శౌర్య పైన చెప్పినవి జరిగే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.