`ల‌క్ష్య` టీజ‌ర్ టాక్‌: ప‌డి లేచిన కెర‌టం


`ల‌క్ష్య` టీజ‌ర్ టాక్‌: ప‌డి లేచిన కెర‌టం
`ల‌క్ష్య` టీజ‌ర్ టాక్‌: ప‌డి లేచిన కెర‌టం

యంగ్ హీరో నాగ శౌర్య న‌టిస్తున్న తాజా చిత్రం `ల‌క్ష్య‌`.  ఆర్చ‌రీ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.  ధీరేంద్ర సంతోష్‌ జాగ‌ర్ల‌పూడి ద‌ర్శ‌‌క‌త్వం వ‌హిస్తున్నారు. సొనాలి నారంగ్ స‌మ‌ర్ప‌ణ‌లో వెంక‌టేశ్వ‌ర సినిమాస్‌, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నార‌య‌ణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు, శ‌ర‌త్ మ‌రార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేతికా శర్మ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

హీరో నాగ‌శౌర్య పుట్టిన రోజు సంద‌ర్భంగా మేక‌ర్స్ ఈ చిత్ర టీజ‌ర్‌ని శుక్ర‌వారం రిలీజ్ చేశారు. ప్ర‌చార చిత్రాల‌తో పాటు తాజాగా విడుద‌లైన టీజ‌ర్ అమితంగా ఆక‌ట్టుకుంటోంది. `చాలా మందికి ఆడితే గుర్తింపు వ‌స్తుంది. కానీ ఎవ‌డో ఒక‌డు పుడ‌తాడు. ఆట‌కే గుర్తింపు తెచ్చేవాడు.. ప‌డి లేచిన‌వాడితో పందెం వేయ‌డం చాలా ప్ర‌మాద‌క‌రం` అంటూ జ‌గ‌ప‌తి బాబు వాయిస్‌తో టీజ‌ర్ మొద‌లైంది. యాంగ‌ర్ మేనేజ్‌మెంట్ వున్న ఓ ఆర్చ‌ర్ క‌థ‌గా ఈ మూవీని తెర‌కెక్కించిన‌ట్టుగా క‌నిపిస్తోంది.

ఆర్చ‌రీ ఆట‌కు గుర్తింపుని తీసుకురావ‌డం.. ఆ త‌రువాత ఆ ఆట‌నే కోల్పోవ‌డం..తిరిగి మ‌ళ్లీ అదే ఆట‌లో రాణించి త‌నేంటో నిరూపించుకోవాల‌ని ప్ర‌య‌త్నించ‌డం.. అందుకు ఎదురైన స‌వాళ్ల స‌మాహారంగా క‌నిపిస్తోంది. కాల‌భైర‌వ సంగీతం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. కండ‌లు తిరిగిన దేహంతో నాగ‌శౌర్య క‌నిపిస్తున్న తీరు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.