నాగ‌శౌర్య `23వ చిత్రం టైటిల్ ఇదే!


నాగ‌శౌర్య `23వ చిత్రం టైటిల్ ఇదే!
నాగ‌శౌర్య `23వ చిత్రం టైటిల్ ఇదే!

యంగ్ హీరో నాగ‌శౌర్య మునుసెన్న‌డూ లేనంత‌గా సినిమాల విష‌యంలో స్పీడు పెంచారు. వ‌రుస ప్రాజెక్ట్‌ల‌కు గ్రీన్ సిగ్న‌లిస్తూ షాకిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న చిత్రాలు వ‌రుడు కావ‌లెను, ల‌క్ష్య చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుండ‌గానే ఇటీవ‌ల అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంబించిన నాగ‌శౌర్య‌ తాజాగా మ‌రో చిత్రాన్ని ప్ర‌క‌టించారు.

ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. నాగ‌శౌర్య న‌టించ‌నున్న 23వ చిత్ర‌మిది. ఆయ‌న పుట్టిన రోజు శుక్ర‌వారం ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని చిత్ర బృందం ఈ చిత్రానికి `పోలీసు వారి హెచ్చ‌రిక‌` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. గురువారం సాయంత్రం ఈ చిత్ర టైటిల్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు.

వినూత్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొంద‌నున్న ఈ చిత్రం ద్వారా కె.పి. రాజేంద్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ ప్రారంభం కాబోతోంది.