నాగ శౌర్య ఫ‌స్ట్ లుక్ టెర్రిఫిక్‌గా వుందే!


నాగ శౌర్య ఫ‌స్ట్ లుక్ టెర్రిఫిక్‌గా వుందే!
నాగ శౌర్య ఫ‌స్ట్ లుక్ టెర్రిఫిక్‌గా వుందే!

నాగ‌శౌర్య కు సాలీడ్ హిట్ ప‌డి చాలా రోజుల‌వుతోంది. ఆ లోటుని ఎలాగైనా తీర్చాల‌ని ఈ యంగ్ హీరో విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. `అశ్వ‌ద్ధామ‌` త‌రువాత నాగ‌శౌర్య ఓ భారీ యాక్ష‌న్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఏషియ‌న్ గ్రూప్ నారాయ‌ణ్ దాస్ నారంగ్‌, పుస్కూరు రామ్మోహ‌న్‌రావు,  నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్  శ‌ర‌త్ మ‌రార్ సంయుక్తంగా ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ద్వారా ధీరేంద్ర సంతోష్ జాగ‌ర్ల‌పూడి ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రీలుక్‌ని ఇటీవ‌ల విడుద‌ల చేశారు. తాజాగా ఫ‌స్ట్ లుక్‌ని సోమ‌వారం చిత్ర నిర్మాత‌ల‌లో ఒక‌రైన నార‌య‌ణ్ దాస్ నారంగ్ పుట్టిన రోజు సంద‌ర్‌భంగా చిత్ర బృందం రిలీజ్ చేసింది. విల్లు ఎక్కుపెట్టి సిక్స్ ప్యాక్ బాడీతో నాగ‌శౌర్య క‌నిపిస్తున్న తీరు టెర్రిఫిక్‌గా వుంది. విభిన్న‌మైన హెయిర్ స్టైల్ … ఆరు ప‌ల‌క‌ల దేహం..ఇవ‌న్నీ చూస్తుంటే సినిమా కొత్త‌గా వుంటుంద‌నిపిస్తోంది. ఆకాష్ పూరి న‌టిస్తున్న `రొమాంటిక్‌` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్న కేతిక శ‌ర్మ ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

నాగ‌శౌర్య 20వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ని ఫైన‌ల్ చేయ‌లేదు. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతున్న మ‌రింత కొత్త పంథాలో ద‌ర్శ‌కుడు ధీరేంద్ర సంతోష్ జాగ‌ర్ల‌పూడి రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని త్వ‌ర‌లో చిత్ర బృందం వెల్ల‌డించ‌నుంద‌ని తెలిసింది.