ఆగ్రహం వ్యక్తం చేసిన కొరటాల ,నాగబాబు


Nagababu and koratala siva unhappy with voting percentage

నిన్నటి రోజున తెలంగాణలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే అయితే గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం ఓటర్లు పెద్దగా తమ ఓటు హక్కు ని వినియోగించుకోలేదు దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దర్శకులు కొరటాల శివ అలాగే నటుడు మెగా బ్రదర్ నాగబాబు . ఓటు హక్కు ప్రతీ ఒక్కరు ఉపయోగించుకోవాలని , కానీ హైదరాబాద్ ఓటర్లు మాత్రం పెద్దగా స్పందించలేదని ….. ఓటు వేసి ప్రజా ప్రతినిధులను సమస్యలపై నిలదీయాలని అంతేకాని ఇంట్లో కూర్చొని వేడుక చూడటం ఏంటి ? అంటూ నిప్పులు చెరిగారు .

ఓటు వేయకుండా ఉన్నవాళ్లు చాలామందే ఉన్నారు కానీ , ఓటు వేయడానికి వచ్చిన వాళ్లలో పాపం కొంతమందికి ఓటర్ జాబితాలో పేరు లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు . ఇక కొంతమంది ఓటు వేయడం దండగ ఈ రాజకీయ నాయకులు మారారు అంటూ వాళ్ళని విమర్శిస్తూ కూర్చుంటారు కానీ ఓటు వేయరు . ఇక కొంతమంది సినిమా కోసం , ఏదైనా పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ అయ్యిందంటే గంటల తరబడి క్యూలో నిల్చుంటారు కానీ ఓటు వేసే ఆసక్తి మాత్రం ఉండదు దాంతో పోలింగ్ శాతం పెంచాలని ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా 70 శాతానికి ఎప్పుడూ మించడం లేదు .

English Title: Nagababu and koratala siva unhappy with voting percentage