నాగ‌బాబు ట్వీట్‌..జ‌నసేన వివ‌ర‌ణ‌!

నాగ‌బాబు ట్వీట్‌..జ‌నసేన వివ‌ర‌ణ‌!
నాగ‌బాబు ట్వీట్‌..జ‌నసేన వివ‌ర‌ణ‌!

ఇటీవ‌ల గాడ్సే దేశ భ‌క్తుడ‌ని ట్వీట్ చేసి సంచ‌ల‌నం సృష్టించారు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు. ఈ వివాదం స‌ద్దు‌మ‌న‌గ‌క‌ముందే మ‌ళ్లీ సోష‌ల్ మీడియా వేదిక‌గా మ‌రో సంచ‌ల‌న‌మైన ట్వీట్ వేశారు. దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద దుమారం చెల‌రేగిన విష‌యం తెలిసిందే. మ‌హాత్మా గాంధీని అవ‌మానించారంటూ పోలీస్ కంప్లైంట్ కూడా న‌మోదు కావ‌డంతో ఆయ‌న త‌న వ్యాఖ్య‌లపై వివ‌ర‌ణ కూడా ఇచ్చారు.

అయినా మ‌రోసారి దాదాపు అదే స్థాయి వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇండియ‌న్ క‌రెన్సీపై  సుభాష్ చంద్ర‌బోస్‌, అంబేద్క‌ర్‌, భ‌గ‌త్‌సింగ్‌, చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్‌, లాల్ బ‌హదూర్ శాస్త్రి, పీవీ న‌ర‌సింహారావు, అబ్దుల్ క‌లామ్‌, సావ‌ర్క‌ర్‌, వాజ్‌పేయ్ లాంటి మ‌హానుభావుల చిత్రాలను కూడా చూడాల‌ని వుంది. ఎందుకంటే స్వ‌తంత్య్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మ‌హానుభావుల‌ని జ‌న‌ము మ‌ర్చిపోకూడ‌ద‌ని ఒక ఆశ‌.

గాంధీగారు బ్ర‌తికి వుంటే ఆయ‌న కూడా త‌న‌తో పాటు దేశానికి సేవ చేసిన  దేశ భ‌క్తుల‌ని గౌర‌వించ‌మ‌ని త‌ప్ప‌కుండా చెప్పేవారు. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మ‌హానుభావుల పేర్లు త‌ప్ప మొహాలు గుర్తు రావ‌డం లేదు. భావిత‌రాల‌కు క‌రెన్సీ నోట్ల‌పై వారి ముఖ ప‌రిచ‌యం చేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల‌పై వుంది` అని నాగ‌బాబు తాజాగా ట్వీట్ చేశారు. నాగ‌బాబు వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేన స్పందించింది. పార్టీలో ల‌క్ష‌లాదిగా వున్న కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించే భావాలు వారి వ్య‌క్త‌గ‌త‌మ‌ని, దానికి జ‌న‌సేన‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ప్ర‌త్యేకంగా మీడియాకు ఓ లేఖ‌ని విడుద‌ల చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

Credit: Twitter