
మెగాడాటర్ నిహారికది పెద్దలు కుదర్చిన పెళ్లే కానీ ఆ పెళ్లి పీటల దాకా వెళ్లడానికి పెద్ద కథే నడిచిందని తెలుస్తోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌విలాస్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా నిహారిక వివాహం గుంటూరు వాస్తవ్యుడు ఐజీ ప్రభాకరరావు తనయుడు జొన్నలగడ్డ చైతన్యతో జరిగింది. ఈ వివాహ వేడుకలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా పాల్గొన్నారు. మెగా హీరోలంతా సంగీత్ , మెహెందీ వేడుకల్లో సందడి చేశారు.
అయితే ఈ పెళ్లి వెనక ఎవరికీ తెలియని ప్రేమకథ వుందని. పెద్దలు కుదర్చిన పెళ్లిగా మారడానికి తెర వెనుక పెద్ద కథే నడిచిందని తెలిసింది. నిహారిక, చైతన్య గత కొంత కాలంగా ప్రేమలో వున్నారట. ఈ విషయాన్ని మెగా బ్రదర్‌కు చెప్పడానికి చాలా సమయం తీసుకున్నారట. ఇందు కోసం ఓ ప్రణాళికని సిద్ధం చేసుకుని నాగబాబుని ప్రసన్నం చేసుకున్నారట. 2015 నుంచే ఈ కథ మొదలైనట్టు తెలిసింది. అపోలో జిమ్‌లో నాగబాబు డైలీ వర్కవుట్లకు వెళుతుంటారు. అదే జిమ్‌లోకి చైతన్య ఎంటరయ్యారట. అక్కడే నాగబాబుతో మాటలు కలిపి తను మంచి అబ్బాయిగా నాగబాబుని ఇంప్రెస్ చేశారట.
ఆ తరువాతే నిహారిక తన తల్లిదండ్రులకు గత సంవత్సరం తన ప్రేమ గురించి వెల్లడించిందట. ఆమె తండ్రి నాగ బాబుకు చైతన్య గురించి తెలిపడంతో చైతన్య కుటుంబం గురించి ఆరా తీసినట్లు తెలిసింది. చైతన్య తండ్రి గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకరరావు గురించి తెలుసుకున్న తరువాత నాగ బాబు నిహారిక ప్రేమ పెళ్లికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. ఐజి జె ప్రభాకర్‌రావుకు చిరంజీవితో మంచి అనుబంధం వుందట. దీంతో నిహారిక ప్రేమ పెళ్లికున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయట. చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రేమ పక్షులు నిహారిక , చైతన్య పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారని నాగబాబు నిహాకి, చైతన్యల పెళ్లి వెనక జరిగిన ఆసక్తికరమైన స్టోరీని బయటపెట్టారు.