పవన్ కళ్యాణ్ చదువుపై మళ్ళీ రచ్చ


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చదువు పై మళ్ళీ రచ్చ మొదలయ్యింది . అసలు ఇంతకీ పవన్ కళ్యాణ్ చదివింది ఏంటి ? ఎంతవరకు చదివాడు ? అన్నది మళ్ళీ మొదలయ్యింది ? ఇటీవల ఎన్నికల సమయంలో అఫిడవిట్ లో 10 పాస్ అని మాత్రమే ప్రకటించాడు . అయితే ప్రచార సభల్లో మాత్రం ఇంటర్మీడియట్ అని , పైగా పలు గ్రూప్ లు చేసానని చెప్పిన పవన్ వివాదానికి తెరలేపాడు .

ఆ వివాదం సమసి పోయిందని అనుకుంటుంటే తాజాగా పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు రిలీజ్ చేసిన వీడియో మరోసారి రచ్చ రచ్చ అయ్యేలా చేస్తోంది . పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ చేసాడని ఆ తర్వాత ఐటీ లో డిగ్రీ చేసాడని చెప్పుకొచ్చాడు . 10 క్లాస్ ఏంటి ? ఇంటర్మీడియట్ ఏంటి ? ఐటీ లో డిగ్రీ ఏంటో ? అసలు ఏది నిజం ?