పవన్ పెళ్లాలపై నాగబాబు అంత మాటన్నాడే


Nagababu sensational comments on pawan kalyan marriages

పవన్ కళ్యాణ్ పెళ్లాలపై నాగబాబు ఎంత మాటన్నాడో తెలుసా ……. పవన్ కళ్యాణ్ చేసుకున్న ఇద్దరు పెళ్ళాలు అతడితో సరిగా ఉండేవాళ్ళు కాదని ,ఆ అలాగే మా కుటుంబంలో కూడా కలిసే వాళ్ళు కాదని కానీ ఇప్పుడున్న మూడో భార్య మాత్రం మా అందరితో కలిసి పోతుందని ….. పవన్ కళ్యాణ్ తో కూడా చాలా బాగా ఉంటోందని సంచలన వ్యాఖ్యలు చేసాడు . అంటే పవన్ కళ్యాణ్ మొదట చేసుకున్న నందినిని , రెండోసారి చేసుకున్న రేణు దేశాయ్ ని మొత్తానికి తప్పుపడుతున్నాడు .

అంతేకాదు మూడో భార్య అయిన అన్నా లెజ్ నోవా ని మాత్రం మెచ్చుకుంటున్నాడు . పవన్ కళ్యాణ్ మూడో భార్య చాలా మంచిది అంటే మిగతా ఇద్దరు ఏంటి ? తెలుగులో అదేదో సామెత ఉన్నట్లు ఉంది నాగబాబు వ్యవహారం . మొత్తానికి తమ్ముడి మూడు పెళ్లిళ్ల ని బాగానే సమర్ధించాడు నాగబాబు . పవన్ కళ్యాణ్ వివాహ సంబంధంలోకి అడుగుపెట్టి 21 సంవత్సరాలు , ఈ 21 సంవత్సరాలలో ఇద్దరినీ మార్చేసి మూడో భార్య తో గత అయిదేళ్లుగా కాపురం చేస్తున్నాడు . అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలలో ఉన్నాడు కాబట్టి మూడు పెళ్ళాల గురించి పెద్ద దుమారం చెలరేగుతోంది . ఇటీవలే ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర స్థాయిలో పవన్ పెళ్లిళ్ల గురించి విమర్శలు చేసిన విషయం తెలిసిందే .

English Title: Nagababu sensational comments on pawan kalyan marriages