పిచ్చి కుక్క‌లు ప్ర‌మాద‌క‌రం – మెగాబ్ర‌ద‌ర్‌

పిచ్చి కుక్క‌లు ప్ర‌మాద‌క‌రం - మెగాబ్ర‌ద‌ర్‌
పిచ్చి కుక్క‌లు ప్ర‌మాద‌క‌రం – మెగాబ్ర‌ద‌ర్‌

ప్ర‌ముఖ న‌టులు, జ‌న‌సేన నాయ‌కులు నాగ‌బాబు మ‌ళ్లీ సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు. ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా హీరో, టీడీపీ నాయ‌కులు నంద‌మూరి బాల‌కృష్ణ ఇండ‌స్ట్రీలో షూటింగ్‌ల‌ పునఃప్రారంభం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వంతో జ‌రుపుతున్న స‌మావేశాల‌కు త‌న‌ని పిల‌వ‌లేద‌ని, మంత్రి త‌ల‌సానితో క‌లిసి హైద‌రాబాద్‌లో భూములు పంచుకుంటున్నారంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఘాటుగా స్పందించారు.

దీంతో వివాదం స‌రికొత్త మ‌లుపు తిరిగింది. బాల‌య్య అలా ఎందుక‌న్నారో అడిగి తెలుసుకుంటాన‌ని, అప్ప‌టి వ‌ర‌కు తాను బాల‌య్య వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌న‌ని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్ వెల్ల‌డించారు. ఇండ‌స్ట్రీ పెద్ద‌లు కూడా బాల‌య్య‌ని అవ‌స‌రం వున్న‌ప్పుడు పిలుస్తామంటూ స్పష్టం చేశారు.  ఇదిలా వుంటే నాగ‌బాబు మ‌రోసారి ట్విట్ట‌ర్‌లో సంచ‌ల‌న ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

`ప్ర‌జా ఆరోగ్య హెచ్చ‌రిక..  పిచ్చికుక్క‌ల‌లో వ్య‌వ‌హారం ప్ర‌మాద‌క‌రం. వాటిని బంధించాలి. లేదా ఇంజెక్ష‌న్ అయినా ఇవ్వాలి. కానీ వాటి ప‌ట్ల నిర్ల‌క్ష్యం త‌గ‌దు. ప్రాణాల‌కే ముప్పుగా ప‌రిణ‌మించ‌వ‌చ్చు. అస‌లే ఇది పిచ్చికుక్క‌ల కాలం` అని ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అంటూ ఓ కుక్క ఫొటోని షేర్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.