సమంత సినిమాని చూడొద్దంటున్న చైతూ


Nagachaitanya sensational comments on samanthaఈనెల 13న సమంత నటించిన యు టర్న్ తో పాటుగా నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు కూడా విడుదల అవుతోంది దాంతో సమంత సినిమాని చూడొద్దు నా సినిమానే చూడండి అని అంటున్నాడు అక్కినేని నాగచైతన్య . సమంత – నాగచైతన్య ఇద్దరు కూడా భార్యాభర్తలు అన్న విషయం తెలిసిందే . అయితే అలాంటి సమంత సినిమాని చూడొద్దని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా …… సమంత కు ఈ ఏడాది ఇప్పటికే రంగస్థలం, మహానటి , అభిమన్యుడు వంటి బ్లాక్ బస్టర్ లు వచ్చాయని కానీ నాకు మాత్రం ఈ ఏడాది ఇదే మొదటి సినిమా కాబట్టి ముందుగా నా సినిమా చూడండి ఆ తర్వాతే సమంత సినిమా చూడండి అని అంటున్నాడు .

నాగచైతన్య చెబుతున్న లాజిక్ బాగానే ఉంది కానీ ప్రేక్షకులు అలా ఆలోచించరు కదా ! వాళ్లకు ఏ సినిమా ముందుగా చూడాలని అనిపిస్తే ఆ సినిమాని చూస్తారు . అయితే నాగచైతన్య మాత్రం శైలజారెడ్డి అల్లుడు పట్ల చాలా నమ్మకంగా ఉన్నాడు ఎందుకంటే ప్రేమకథ తో పాటు వినోదానికి పెద్ద పీట వేసిన చిత్రం మాదని అందుకే శైలజారెడ్డి అల్లుడు చిత్రాన్ని మొదట చూడమని చెబుతున్నానని అంటున్నాడు అలాగే యు టర్న్ కూడా బాగుందని కాకపోతే మా సినిమా ఎంటర్ టైన్ మెంట్ సినిమా కాబట్టి నాదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు . మొత్తానికి భార్యాభర్తల చిత్రాలు ఒకేరోజున విడుదల అవుతుండటంతో ఇద్దరిలో కూడా టెన్షన్ మొదలయ్యింది .

English Title: Nagachaitanya sensational comments on samantha