నాగచైతన్య – సమంతలలో గెలిచేది ఎవరు ?


Nagachaitanya vs Samantha who will winఈరోజు అక్కినేని నాగచైతన్య , సమంత లు నటించిన రెండు చిత్రాలు విడుదల అవుతున్నాయి అయితే పండగ రోజున విడుదల అవుతున్న ఈ రెండు చిత్రాల్లో ఏది విజయం సాధిస్తుందో ? ఎవరు గెలుస్తారో ? అన్న ఆత్రుత నెలకొంది అక్కినేని అభిమానుల్లో . నాగచైతన్య శైలజారెడ్డి అల్లుడు గా నటిస్తుండగా థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన యు టర్న్ చిత్రంలో సమంత నటిస్తోంది. శైలజారెడ్డి అల్లుడు వినోదభరితంగా రూపొందగా యు టర్న్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది . ఈ రెండు సినిమాలపై కూడా అంచనాలు ఉన్నాయి దాంతో హిట్ కొట్టేది ఎవరు ? అన్న ఆసక్తి నెలకొంది .

సమంత – నాగచైతన్య లు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . సినిమాల్లో కలిసి నటించి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసి నిజంగానే రియల్ లైఫ్ లో కూడా రొమాన్స్ కి దిగారు . సమంత హీరోయిన్ గా స్టార్ స్టేటస్ పొందింది , తెలుగులో మాత్రమే కాకుండా తమిళనాట కూడా సమంతకు మంచి క్రేజ్ ఉంది అయితే నాగచైతన్య మాత్రం ఇంకా స్టార్ డం అందుకోలేకపోతున్నాడు . మరి ఈ శైలజారెడ్డి అల్లుడు చిత్రంతోనైనా తిరుగులేని హిట్ అందుకొని స్టార్ లీగ్ లో చేరుతాడా చూడాలి . మరికొద్ది గంటల్లోనే నాగచైతన్య – సమంత లలో విజయం సాధించేది ఎవరో తేలిపోనుంది .

English Title: Nagachaitanya vs Samantha who will win