బిగ్‌బాస్ 4: కింగ్ ల్యాండ్ అయిపోయారు!


nagarjuna back in hyderabad for bigboss 4
nagarjuna back in hyderabad for bigboss 4

బిగ్‌బాస్ సీజ‌న్ 4 క్రమ‌ క్ర‌మంగా ఆస‌క్తిక‌రంగా మారుతోంది. ఈ రియాలిటీ షోకి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌త వారం వీకెండ్‌లో ఉన్న‌ట్టుండి నాగార్జున ఈ షోని స్కిప్ చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న స్థానంలో నాగ్ కోడ‌లు స‌మంత హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించింది. అయినా నాగ్‌ల మెస్మ‌రైజ్ చేయ‌లేక‌పోయింది. దీంతో నాగ్ మ‌ళ్లీ ఈ వీకెండ్‌లో బిగ్‌బాస్ షోలో క‌నిపించ‌బోతున్నారు.

నాగ్ న‌టిస్తున్న తాజా చిత్రం `వైల్డ్ డాగ్‌`. అహిషోర్ సాల్మ‌న్ ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజ‌న్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. తాజాగా కీల‌క షెడ్యూల్ కోసం టీమ్ హిమాల‌యాల్లోని మ‌నాలికి వెళ్లారు. అక్క‌డే 21 డేస్ పాటు కీల‌క ఘ‌ట్టాల్ని షూట్ చేస్తున్నారు.

ఇందు కోసం మనాలీ వెళ్లిన నాగార్జున తాజాగా హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చారు. రావ‌డం రావ‌డ‌మే బిగ్‌బాస్ షూటింగ్ మొద‌లుపెట్టారు. ఈ శ‌నివారం నాగ్ షోలో ప్ర‌త్య‌క్ష్యం కాబోతున్నారు. సండే కూడా షోలో సంద‌డి చేసి `వైల్డ్ డాగ్‌` కోసం మండే మ‌ళ్లీ మ‌నాలీ వెళ్ల‌బోతున్నారు. దీంతో ఈ వారం షో ప్ర‌ధాన్య‌త‌ని సంత‌రించుకుంది.