ఓల్డ్‌మెన్ గెట‌ప్‌లో కింగ్ నాగార్జున‌!



ఓల్డ్‌మెన్ గెట‌ప్‌లో కింగ్ నాగార్జున‌!
ఓల్డ్‌మెన్ గెట‌ప్‌లో కింగ్ నాగార్జున‌!

కింగ్ నాగార్జున ఓల్డ్‌మెన్ గెట‌ప్‌లో క‌నిపించి షాకిచ్చారు. అయితే నాగ్ ఓల్డ్ గెట‌ప్ వేసింది సినిమా కోసం కాదు. రియాలిటీ షో ప్ర‌మోష‌న్ కోసం. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్‌. సీజ‌న్ 4 త్వ‌ర‌లో ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. క‌రోనా కార‌ణంగా ఈ సీజ‌న్ మొద‌ల‌వుతుందా?  లేదా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో వాటికి చెక్ పెడుతూ మేక‌ర్స్ బిగ్ బాస్ సీజ‌న్ వ‌చ్చేస్తోందంటూ ఓ ప్రోమోని వ‌దిలారు.

తాజాగా మ‌రో ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున న‌టించారు. ఓల్డ్‌మెన్ గెట‌ప్‌లో నాగ్ క‌నిపించిన ఈ ప్రోమో బిగ్‌బాస్ సీజ‌న్ 4 పై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చిన ఈ నేప‌థ్య‌లో కోవిడ్ నిబంధ‌న‌ల‌ని పాటిస్తూ ఈ షోని నిర్వ‌హించ బోతున్నారు. మొత్తం 16 మంది కంటెస్టెంట్‌లు ఈ షోలో పాల్గొన బోతున్నారు. వారు ఎవ‌ర‌నేది ఇప్ప‌టికే బ‌య‌టికి వ‌చ్చినా బిగ్‌బాస్ మేక‌ర్స్ మాత్రం క్లారిటీ ఇవ్వ‌డం లేదు.

గ‌త సీజ‌న్‌కు పూర్తి భిన్నంగా సీజ‌న్ 4 వుంబోతోంది. దాదాపు 106 డేస్ ఈ షోని నిర్వ‌హించ‌నున్నార‌ట. ఈ నెలాఖ‌రు నుంచే సీజ‌న్ 4 ప్రారంభం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. నాగార్జున పుట్టిన రోజైన ఈ నెల 29న షోని స్టార్ట్ చేసి కంటిన్యూ చేయాల‌ని నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్నార‌ట‌. దీనికి సంబంధించిన కీల‌క ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానున్న‌ట్టు తెలుస్తోంది.