ముమ్మాటికీ నాగార్జున చేసిన పెద్ద తప్పు


nagarjuna blunder mistake acting in rgv officer movie

తెలిసి తెలిసి రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటించడం హీరో నాగార్జున తప్పని విరుచుకు పడుతున్నారు నాగార్జున అభిమానులు . తాజాగా నాగార్జున వర్మ దర్శకత్వంలో ” ఆఫీసర్ ” అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే . ఆ చిత్రం ఈరోజు విడుదల అయ్యింది . గతకొంత కాలంగా వర్మ దర్శకత్వంలో వస్తున్న కళాఖండాలు ఎలా ఉంటున్నాయి ప్రేక్షకులకు తెలుసు కాబట్టి ఆఫీసర్ చిత్రంపై పెద్దగా అంచనాలు లేకుండా పోయాయి .

అయితే ఎక్కడో చిన్న ఆశ …… ఎందుకంటే నాగార్జున నమ్మకంగా ఉన్నాడు పైగా ఒప్పుకొని మరీ సినిమా చేసాడు కాబట్టి పొరపాటున హిట్ కాకపోతుందా అని ఆశ . కానీ ఆ ఆశ అడియాసలయ్యాయి సినిమా విడుదలయ్యాక . ఏమాత్రం నిర్మాణ విలువలు లేని చిత్రంలో , నాసిరకమైన చిత్రంలో నాగార్జున నటించి తన పరువు తీసుకున్నాడు అని అభిమానులు గగ్గోలు పెడుతున్నారు . నిజంగానే అభిమానుల ఆందోళన లో వాస్తవం ఉంది , ఎందుకంటే ఆఫీసర్ చిత్రంలో నాగార్జున నటన తప్ప , బేబీ కావ్య నటన తప్ప మరో అంశం ఏమి లేదు ….. అంత దారుణంగా తీసాడు వర్మ ఆఫీసర్ చిత్రాన్ని . వర్మ చేస్తున్న చిత్రాలన్నీ చెత్త సినిమాలు అవుతున్న ఈ సమయంలో నాగార్జున రిస్క్ చేసి మరీ సినిమా ఒప్పుకోవడం నాగార్జున తప్పే