వైష్ణ‌వ్‌తేజ్ ఫిల్మ్ని క‌న్ఫ‌ర్మ్ చేసిన నాగ్‌!

Nagarjuna confirmed vaishnav tejs film
Nagarjuna confirmed vaishnav tejs film

కింగ్ నాగార్జున న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `వైల్డ్ డాగ్‌`. అహిషోర్ సాల్మాన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ మూవీని 2007లో హైద‌రాబాద్‌లో జ‌రిగిన వ‌రుస బాంబు పేలుళ్ల నేప‌థ్యంలో రూపొందించారు. దియా మీర్జా, స‌యామీఖేర్‌, అలీరెజా కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం ఈ నెల 2న వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌ల కాబోతోంది.

ఈ సంద‌ర్భంగా గ‌త కొన్ని రోజుల నుంచే కింగ్ నాగ్ ఈ మూవీ ప్ర‌చారాన్ని మొతెక్కిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న వైష్ణ‌వ్‌తేజ్ మూవీపై క్లారిటీ ఇచ్చారు. `ఉప్పెన‌` చిత్రంతో ప‌రిచ‌య‌మైన వైష్ణ‌వ్ తేజ్ తొలి చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ త‌రువాత క్రిష్ డైరెక్ష‌న్‌లో `కొండ పొలం` న‌వ‌ల ఆధారంగా ఓ మూవీని పూర్తి చేశారు. ముచ్చ‌ట‌గా మూడ‌వ చిత్రాన్ని అన్న పూర్ణ బ్యాన‌ర్‌లో చేయ‌బోతున్నారు.

ఇప్ప‌టికే ఈ మూవీ కోసం వైష్ణ‌వ్ తేజ్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చేశార‌ట‌. ఈ చిత్రానికి వైష్ణ‌వ్‌కు భారీగానే పారితోషికం ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలిసింది. దీనిపై నాగ్ స్పందించారు. ఈ మూవీ ద్వారా కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేయ‌బోతున్నాం. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుంది అని నాగ్ స్ప‌ష్టం చేశారు.