డైరెక్ట‌ర్‌కు డెడ్‌లైన్ పెట్టిన కింగ్ నాగార్జున‌?

డైరెక్ట‌ర్‌కు డెడ్‌లైన్ పెట్టిన కింగ్ నాగార్జున‌?
డైరెక్ట‌ర్‌కు డెడ్‌లైన్ పెట్టిన కింగ్ నాగార్జున‌?

గ‌త ఏడాది క‌రోనా స్వైర విహారం చేసినా ఏడాది చివ‌ర‌లో టాలీవుడ్‌లో వున్న అంద‌రు హీరోల‌కు మించి బిజీ బిజీగా గ‌డిపేశారు కింగ్ నాగార్జున‌. షూటింగ్‌ల‌కు అనుమ‌తులు ల‌భించ‌డంతో ముందుగా రంగంలోకి దిగిన కింగ్ బిగ్‌బాస్ సీజ‌న్ 4 ని ప‌ట్టాలెక్కించారు. ఓ ప‌క్క బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూనే త‌ను న‌టిస్తున్న `వైల్డ్ డాగ్‌` షూటింగ్ని కూడా ప‌రుగులు పెట్టించారు.

నాగ్ స్పీడు చూసి యంగ్ హీరోల‌తో పాటు మెగాస్టార్ లాంటి వాళ్లే ఆశ్చ‌ర్య‌పోయారంటే అతిశ‌యోక్తి కాదేమో. బిగ్‌బాస్ సీజ‌న్ 4, `వైల్డ్ డాగ్` పూర్తి కావ‌డంతో న్యూ ఇయ‌ర్ కోసం వెకేష‌న్ కోసం విదేశాలు వెళ్లిన నాగార్జున ఈ వారం తిరిగి ఇండియా రాబోతున్నారు. వ‌చ్చిన వెంట‌నే ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న మూవీని స్టార్ట్ చేయ‌బోతున్నార‌ట‌.

శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ పై నారాయ‌ణ్ దాస్ నారంగ్‌, పి. రామ్మోహ‌న్‌రావు, శ‌ర‌త్‌మ‌రార్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మించ‌బోతున్నారు. అయితే ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ స్టోరీగా రానున్న ఈ మూవీ ఫైన‌ల్ డ్రాఫ్ట్‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ఇంత వ‌ర‌కు పూర్తి చేయ‌లేద‌ట‌. దీంతో నాగ్ పూర్తి డ్రాఫ్ట్‌ని రెడీ చేసి త‌న వ‌ద్ద‌కు ర‌మ్మ‌ని డెడ్ లైన్ విధించిన‌ట్టు తెలిసింది.