సినీ వర్కర్స్ సహాయార్థం నాగార్జున కోటి విరాళం!


సినీ వర్కర్స్ సహాయార్థం నాగార్జున కోటి విరాళం!
సినీ వర్కర్స్ సహాయార్థం నాగార్జున కోటి విరాళం!

ప్ర‌పంచం మొత్తం హాహా కారాలు చేస్తోంది. ఎక్క‌డ చూసినా క‌రోనా మ‌ర‌ణాల‌తో భూగోళం ద‌ద్ద‌రిల్లిపోతోంది. ఇట‌లీ ఇప్ప‌టికే వైద్యం అందించ లేక చేతులు ఎత్తేసింది. దీంతో అక్క‌డ రోజు 900 ల‌కు మించి మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. స్పెయిన్ కూడా మ‌ర‌ణాల్లో ఇట‌లీని దాటిపోతోంది. ఈ రెండింటితో అగ్ర‌రాజ్యం అమెరికా కూడా పోటీపడుతోంది. ఇప్ప‌టికే అక్క‌డ ల‌క్ష పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి. ఏం చేయాలో దిక్కుతోచ‌ని స్థితి. క‌రోనాకు మందు లేదు.

దీంతో నివార‌ణ ఒక్క‌టే మార్గం అంటూ సోష‌ల్ డిస్టెన్సీ పాటించాల‌ని దేశాన్నీ ముక్త కంఠంతో కోరుతున్నాయి. క‌రోనా క‌ట్ట‌డికి దేశాల‌న్నీ లాక్ డౌన్‌ని పాటించ‌డం మొద‌లుపెట్టాయి. దీంతో రోజు ప‌నిచేస్తే కానీ పూట గ‌డ‌వ‌ని కార్మిక కుటుంబాల‌న్నీ అర‌ణ్య రోద‌న చేస్తున్నాయి. వారిని ఆదుకోవ‌డం కోసం హీరోలు ముందు కొస్తున్నారు.

ఇటీవ‌ల చిరంజీవి కోటి రూపాయ‌లు ప్ర‌క‌టించిన త‌న గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. అదే బాట‌లో ఎన్టీఆర్ 25 ల‌క్ష‌లు. మ‌హేష్ 25 ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు. ఈ కోవ‌లోనే సినీ వ‌ర్క‌ర్స్ స‌హాయార్థం కింగ్ నాగార్జున కోటి విరాళం ప్ర‌క‌టించ‌డంతో కార్మిక సంఘాలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ సంద‌ర్భంగా నాగార్జున మాట్లాడుతే రోజు వారీ కార్మికుల కోసం త‌న వంతు బాధ్య‌త‌గా కోటి విరాళం ఇస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. ఈ లాక్ డౌన్ వేళ ఇంటిలోనే వుండి విధిగా పాటించాల‌ని పిలుపునిచ్చారు.

Credit: Twitter