నాగార్జున కు తలనొప్పిగా మారిన బిగ్ బాస్ వివాదం


Big Boss 3 Telugu
Big Boss 3 Telugu

బిగ్ బాస్ 3 పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి , వివాదాలు రాజుకుంటున్నాయి . ఇంకా కార్యక్రమమే స్టార్ట్ కాలేదు అప్పుడే ఈ షోపై వివాదాలు చుట్టుకుంటున్నాయి . యాంకర్ శ్వేతా రెడ్డి బిగ్ బాస్ నిర్వాహకులు నలుగురిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టగా తాజాగా మరో హాట్ భామ గాయత్రి గుప్తా కూడా కేసు పెట్టింది రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో .

ఇలా బిగ్ బాస్ 3 స్టార్ట్ కాకముందే వివాదాలు వస్తుండటంతో నాగార్జున షాక్ అయ్యాడట ! ఈ షోపై ఇంతకుముందు కూడా వివాదాలు వచ్చాయి కానీ అవి వేరు కానీ ఇప్పుడు వస్తున్నవి సెక్స్ గురించి . బిగ్ బాస్ ని ఎలా శాటిస్ ఫై చేస్తావ్ ? అని ఒకరిని అడగగా మరొకరిని వంద రోజుల పాటు సెక్స్ చేయకుండా ఉండగలవా ? అంటూ ప్రశ్నించి వివాదానికి ఆజ్యం పోశారట . ఈనెల 21న బిగ్ బాస్ స్టార్ట్ కానుంది . అది స్టార్ట్ అయ్యాక ఇంకా ఎన్ని గొడవలు జరుగుతాయో చూడాలి . ఏది ఏమైనా నాగార్జున కు ఈ బిగ్ బాస్ తలనొప్పిగానే మారిందట .