నాగార్జున ఫ్యాన్స్ వర్మ ని ఏం చేసారో తెలుసా


nagarjuna fans innovative treat for ramgopal varma

అక్కినేని నాగార్జున అభిమానులు దర్శకులు రాంగోపాల్ వర్మ పై చాలా ఆగ్రహంగా ఉన్నారు . ఆఫీసర్ చిత్రం పరమచెత్త చిత్రంగా తేలడంతో అభిమానుల గుండెలు అగ్ని గోళాలు అవుతన్నాయి దాంతో తమ కోపాన్ని తీర్చుకోవడానికి నాగార్జున అభిమానులు ఏం చేసారో తెలుసా …… …. రాంగోపాల్ వర్మ ఫోటో కు పాలాభిషేకం చేసారు . విచిత్రంగా ఉంది కదూ ! మీరు చదువుతున్నది నిజమే రాంగోపాల్ వర్మ ఫోటో ని ముక్కలు ముక్కలు చేయాల్సింది పోయి పాలాభిషేకం చేయడం ఏంటి ? అని అనుకుంటున్నారా ?

ఆఫీసర్ సినిమా ఇచ్చిన షాక్ నుండి ఇంకా అభిమానులు తేరుకోలేదు దానికి తోడు అఖిల్ తో రాంగోపాల్ వర్మ సినిమా అంటూ ఆమధ్య స్వయంగా వర్మ ప్రకటించాడు దాంతో ఆఫీసర్ సినిమా పొతే పోయింది కానీ అఖిల్ తో మాత్రం సినిమా వద్దు మహా ప్రభో ! అంటూ పాలాభిషేకం చేసారు . తమ నిరసన ని విభిన్నంగా తెలిపి వార్తల్లోకి ఎక్కారు నాగార్జున అభిమానులు . ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది .