బయోపిక్ అంటే భయపడుతున్న నాగార్జున


Nagarjuna feared with NTR biopic

అక్కినేని నాగార్జున బయోపిక్ తీయాలంటే భయపడిపోతున్నాడట . ఇప్పటికే పలుమార్లు ప్రకటించాడు నాన్నగారి బయోపిక్ చేయాలనే ఆలోచన లేదని ఎందుకంటే నాన్నగారిది సంపూర్ణమైన జీవితం అందుకే ఆ ఆలోచన లేదు అని స్పష్టం చేసాడు . అయితే సుమంత్ అక్కినేని పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ లో నటించాడు . సుమంత్ అచ్చం అక్కినేని లా కనిపించడంతో అక్కినేని బయోపిక్ పై మళ్ళీ వార్తలు గుప్పుమన్నాయి .

అయితే నాగార్జున కూడా సుమంత్ లుక్ తో అక్కినేని బయోపిక్ గురించి ఓ చిన్న ఆలోచన చేసాడట కానీ ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ కావడంతో ఇక అక్కినేని బయోపిక్ అంటే భయపడుతున్నాడట . బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ అంటేనే జనాలు చూడలేదు ఇక సుమంత్ తో అక్కినేని బయోపిక్ అంటే మాత్రం చూస్తారా ? అసలే సుమంత్ కు మార్కెట్ లేదు మరి అని ఆ ఆలోచన విరమించుకున్నాడట .

English Title: Nagarjuna feared with NTR biopic