బిగ్ బాస్ కంటెస్టంట్ కోరిక తీర్చిన నాగ్


బిగ్ బాస్ కంటెస్టంట్ కోరిక తీర్చిన నాగ్
బిగ్ బాస్ కంటెస్టంట్ కోరిక తీర్చిన నాగ్

మా టీవీలో జరిగిన బిగ్ బాస్ సీజన్ 3 లో ఆడిన అందరిలో బుల్లితెర అర్జున్ రెడ్డి గా గుర్తింపు పొందిన వ్యక్తి అలీ రెజా. అంతకుముందు ఒక నటుడిగా, మోడల్ గా అతను పొందిన గుర్హింపు కన్నా, ఎక్కువగా, హౌస్ లో అతని ఆట తీరు, ఇంకా ఏదీ ఉన్న మొహాన అనేసే అతని మాట తీరు జనాలకు బాగా నచ్చింది. అందుకే ఒకసారి ఎలిమినేట్ అయినా, మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో హౌస్ లోకి వెళ్ళాడు.

నాగార్జున కూడా అనేక సందర్భాల్లో అలీ రెజా ఫిజిక్ ని, స్టైల్ ని ఆట తీరు ని మెచ్చుకున్నాడు. ఇక కొన్ని విషయాలలో నచ్చకపోతే పద్ధతి మార్చుకొమ్మని మందలించాడు. సీజన్ మొత్తం మీద అలీ ట్రెండ్ అయ్యాడు. ఇక అలీ తనకి ఎన్నో విషయాల్లో నాగార్జున ఆదర్శం అని చెప్పాడు. ఒకానొక సందర్భంలో నాగార్జున దించిన షూస్ తనకు బాగా నచ్చాయని, “మీ గుర్తుగా నాకు అవి ఇవ్వమని” అలీ అడిగాడు. అయితే సీజన్ ముగిసాక ఇన్ని రోజుల తరువాత నాగార్జున గుర్తు పెట్టుకుని మరీ, అలీకి ఆ షూస్ గిఫ్ట్ గ ఇచ్చాడు. ఒక పెద్ద స్టార్ తనకు చేసిన ప్రామిస్ ని ఇలా గుర్తుపెట్టుకుని స్వయంగా పిలిపించుకుని మరీ గిఫ్ట్ ఇవ్వడంతో అలీ ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు. అందుకే మా నాగ్ సర్ గ్రేట్ అంటూ ఆనందపడుతున్నాడు.

మరి, అలీ – నాగ్ స్నేహం ఇలాగే ఉంటూ, నాగ చైతన్య & అఖిల్ సినిమాలలో అలీకి ఛాన్స్ లు ఇచ్చే దాకా వెళ్తుందో చూద్దాం .

Credit: Instagram