సోగ్గాడే డైరెక్టర్ కు షాక్ ఇచ్చిన నాగార్జున


Nagarjuna
Nagarjuna

సోగ్గాడే చిన్ని నాయనా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కు షాక్ ఇచ్చాడు కింగ్ నాగార్జున . కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా బంగార్రాజు అనే సినిమా చేయాలనుకున్నారు . కళ్యాణ్ కృష్ణ ఆ మేరకు స్క్రిప్ట్ వర్క్ చేసాడు కూడా అలాగే నటీనటులను ఎంపిక చేసారు ఇక సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అని అనుకున్న సమయంలో షాక్ ఇస్తూ మన్మథుడు 2 చిత్రాన్ని కంప్లీట్ చేసాడు నాగార్జున .

కట్ చేస్తే మన్మథుడు 2 కంప్లీట్ అయ్యింది , రిలీజ్ కి కూడా సిద్దమయ్యింది . అయితే బంగార్రాజు మాత్రం సెట్స్ మీదకు వెళ్లేలా కనిపించడం లేదు . ఎందుకంటే బిగ్ బాస్ 3 కి రెడీ అయిపోయాడు నాగార్జున . అయితే దర్శకులు కళ్యాణ్ కృష్ణ మాత్రం నాగార్జున గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు . అయితే నాగార్జున మాత్రం బంగార్రాజు స్క్రిప్ట్ అనుకున్న స్థాయిలో రాలేదని నిరాశతో ఉన్నాడట అందుకే కళ్యాణ్ కృష్ణ కు హ్యాండ్ ఇచ్చినట్లే అని అంటున్నారు .