నాగ్ మరో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా?

నాగ్ మరో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా?
నాగ్ మరో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా?

కింగ్ నాగార్జున ఈ ఏడాది నటించింది కేవలం ఒకే ఒక్క చిత్రంలో మాత్రమే.  ఫ్రెంచ్ `ఐడూ` చిత్రాన్ని తెలుగులో `మన్మథుడు 2` పేరుతో రీమేక్ చేస్తే ఆశించిన ఫలితాన్ని అందించకపోగా నాగార్జునకు భారీ డిజాస్టర్ని అందించింది. దీంతో కథల ఎంపిక విషయంలో జాగ్రత్తుల  పడుతున్న నాగార్జున 2020లో కొత్త తరహా చిత్రాలతో ఆకట్టుకోబోతున్నారు.

`మప్మథుడు 2` తరువాత నుంచి బిగ్ బాస్ పనుల్లో పడి బిజీ అయిన నాగ్ `వైల్డ్ డాగ్` సినిమాతో సడెన్ సర్ప్రైజ్ ఇచ్చి షాకిచ్చారు.ఆయన నటిస్తున్న తాజా చిత్రం `వైల్డ్ డాగ్`. అహిషోర్ సోలోమన్ దర్శకుడు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2009లో ఎన్ ఐఏ అధికారి, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా నాగార్జున నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ సైలెంట్ గా జరుగుతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ని మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా వుంటే నాగార్జున మరో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. బాలీవుడ్ లో అజయ్ దేవగన్, ఇలియానా జంటగా నటించిన చిత్రం `రెయిడ్`. అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో తెలుగులో రీమేక్ చేయబోతున్నారట. 1980లో ఉత్తర ప్రదేశ్ లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ఐటీ అధికారిగా అజయ్ దేవ్ గన్ నటించారు. అదే పాత్రని తెలుగులో నాగార్జున చేయబోతున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నారట. దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాల్ని చిత్ర వర్గాలు వెల్లడించనున్నట్టు తెలిసింది.