ఆ సినిమా నాగార్జున కు నచ్చిందట


nagarjuna happy with savyasachi outputనాగచైతన్య నటించిన సవ్యసాచి చిత్రాన్ని నాగార్జున చూశాడట ! మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నాగార్జున కు నచ్చిందట దాంతో చిత్ర బృందాన్ని అభినందించడమే కాకుండా భయపడకండి తప్పకుండా హిట్ అవుతుందని భరోసా కూడా ఇచ్చాడట . నాగార్జున అభయ హస్తం ఇవ్వడంతో సవ్యసాచి బృందం చాలా చాలా సంతోషంగా ఉంది . చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది , ఇతర ముఖ్య పాత్రల్లో భూమిక చావ్లా , తమిళ నటుడు మాధవన్ , వెన్నెల కిషోర్ , రావు రమేష్ తదితరులు నటించారు .

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎప్పుడో విడుదల చేయాలనీ అనుకున్నారు అయితే శైలజా రెడ్డి చిత్రం వల్ల సవ్యసాచి సకాలంలో పూర్తికాలేదు . ఇంకా పదిరోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందట అది కూడా కంప్లీట్ అయితే నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తిచేసి ఆగస్టు లో విడుదల చేయడానికి వీలు అవుతుంది లేదంటే ఇంకా ఆలస్యం అవుతుంది .

పది రోజుల షూటింగ్ ని కంప్లీట్ చేయడానికి నాగార్జున కు సవ్యసాచి చిత్రాన్ని చూపించారట ! సినిమా మొత్తం చూసిన నాగార్జున బాగుందని మెచ్చుకోవడమే కాకుండా స్వల్ప మార్పులు కూడా చెప్పాడట ! నాగార్జున చూసి బాగుందని మెచ్చుకోవడంతో ఇక సవ్యసాచి కి అడ్డు ఉండదని మిగతా పనులు చకచకా చేసుకోవచ్చని భావిస్తున్నారు ఆ చిత్ర దర్శక నిర్మాతలు .

nagarjuna happy with savyasachi output