త్రివిక్రమ్ పై కోపంగా ఉన్న నాగార్జున


Nagarjuna and Trivikram
Nagarjuna and Trivikram

కింగ్ నాగార్జున దర్శకులు త్రివిక్రమ్ పై చాలా కోపంగా ఉన్నాడు . అందుకే మన్మథుడు విజయం గురించి మాట్లాడినప్పుడు ఆ సినిమా దర్శకులు కే . విజయభాస్కర్ గురించి పొగుడుతున్నారు కానీ ఆ సినిమా రచయిత అయిన త్రివిక్రమ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంతేకాదు త్రివిక్రమ్ గురించి అడిగితే నెక్స్ట్ క్వశ్చన్ అంటూ మాట మార్చారు తప్ప త్రివిక్రమ్ పేరు పలకడానికి కూడా ఇష్టపడటం లేదు నాగార్జున .

అతడి పై నాగార్జున కు ఇంత కోపం రావడానికి చాలా కారణాలు ఉన్నాయట ! అఖిల్ – త్రివిక్రమ్ లతో ఓ సినిమా చేయాలనుకున్నారు కానీ కుదరలేదు . అలాగే అ …. ఆ చిత్రం నాగచైతన్య చేయాల్సి ఉండే కానీ చివరి నిమిషంలో నితిన్ వచ్చి చేరాడు అందుకు త్రివిక్రమ్ కారణం అంటూ నాగ్ కోపంగా ఉన్నాడట ! అట ! ……. లోగుట్టు పెరుమాళ్ళ కెరుక !!