నాగార్జున – ప్రవీణ్ సత్తారు సినిమా స్టోరీలైన్ ఇదేనా?


నాగార్జున - ప్రవీణ్ సత్తారు సినిమా స్టోరీలైన్ ఇదేనా?
నాగార్జున – ప్రవీణ్ సత్తారు సినిమా స్టోరీలైన్ ఇదేనా?

అక్కినేని నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్న విషయం తెల్సిందే. కొత్త  దర్శకుడు సోలమన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో నాగ్ ఎన్ఐఏ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. చాలా కొత్తగా థ్రిల్లింగ్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. వైల్డ్ డాగ్ చిత్రీకరణ ఇటీవలే తిరిగి మొదలైంది. వచ్చే నెలకు వైల్డ్ డాగ్ షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు నాగార్జున వైల్డ్ డాగ్ తో పాటు బిగ్ బాస్ చిత్రీకరణలో పాల్గొంటున్న విషయం తెల్సిందే. బిగ్ బాస్ షూటింగ్ కూడా నవంబర్ వరకూ ఉంటుంది. ఈ రెండు పూర్తయ్యాక నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో యాక్షన్ డ్రామాను చేస్తున్న విషయం రివీల్ అయింది.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీలైన్ రీసెంట్ గా బయటకు వచ్చింది. ఇందులో నాగార్జున ఒక రైతుగా కనిపిస్తాడని తెలుస్తోంది. ఒక రైతు తన తప్పిపోయిన కూతురుని వెతికే క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, చేసిన రిస్కులు ఆధారంగా కథను అల్లాడట ప్రవీణ్ సత్తారు. నాగ్ ప్రస్తుత ఇమేజ్ కు ఇలాంటి కథ చాలా కొత్తగా ఉంటుందని దర్శకుడు భావిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుంది.