పూరి – నాగ్ కాంబోలో ఆసక్తికర చిత్రం?

పూరి - నాగ్ కాంబోలో ఆసక్తికర చిత్రం?
పూరి – నాగ్ కాంబోలో ఆసక్తికర చిత్రం?

డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్, అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో సినిమా ఉంటుందని గత కొద్ది రోజుల నుండి ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. పూరి జగన్నాథ్ తో నాగార్జున ఇప్పటికే రెండు సినిమాలకు పనిచేసాడు. అటు శివమణి, ఇటు సూపర్ రెండూ కూడా యావరేజ్ హిట్స్ గానే నిలిచాయి. కాగా వచ్చే సంవత్సరం వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. బాక్సింగ్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా ఈ చిత్రం. కరోనా వైరస్ కారణంగా షూటింగులకు బ్రేకులు పడడంతో ఈ సినిమా అర్ధాంతరంగా నిలిచిపోయింది. వచ్చే నెలలో ఈ సినిమా తిరిగి పట్టాలెక్కుతోందని సమాచారం.

లాక్ డౌన్ సమయంలో పూరి జగన్నాథ్ నాగార్జున కోసం ఫాంటసీ నేపథ్యంలో సాగే కథను అనుకున్నాడట. ఇప్పటికే కథ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ కాంబోలో సినిమా ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.