హాట్ టాక్: నాగ్ బిగ్ బాస్ రెమ్యునరేషన్


Nagarjuna remuneration for big boss telugu 3
Nagarjuna remuneration for big boss telugu 3

మొత్తానికి తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా పూర్తయ్యింది. ఇంట్రెస్టింగ్ కంటెస్టింగ్స్ తో 105రోజుల పాటు షో బుల్లితెర అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించింది. ఇకపోతే షో ముగిసిన అనంతరం రెమ్యునరేషన్ కి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. హోస్ట్ నుంచి కంటెస్టెంట్స్ వరకు వారి రెమ్యునరేషన్ లెక్కలు మెల్లగా బయటకు వస్తున్నాయి.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. రెమ్యునరేషన్ విషయంలో నాగార్జున కి అందిన నెంబర్లు ఇంట్రెస్టింగ్ గా మారాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ – నానిల కంటే కూడా మన్మథుడు చాలా తక్కువగా తీసుకున్నట్లు తెలుస్తోంది. షోని తనదైన శైలిలో నడిపించిన నాగార్జున అలుపు లేకుండా హోస్ట్ బాధ్యతలను చక్కగా నిర్వర్తించాడు. ఇక పారితోషికం విషయానికి వస్తే.. నాగార్జున 30కి పైగా ఎపిసోడ్స్ లో స్పెషల్ ఏంట్రాక్షన్ గా నిలిచిన 5కోట్లకు పైగా అందుకున్నట్లు తెలుస్తోంది.
మధ్యలో స్పెయిన్ ట్రిప్ కోసమని కొంత గ్యాప్ ఇచ్చినప్పటికి ఎలాంటి కటింగ్స్ లేకుండా ముందు అనుకున్న ఒప్పందం ప్రకారం నాగ్ కి రెమ్యునరేషన్ అందినట్లు టాక్. ఇక మొదటి సీజన్ బిగ్ బాస్ 1 హోస్ట్ గా ఉన్న ఎన్టీఆర్ కి 10 నుంచి 12కోట్ల వరకు అందగా.. బిగ్ బాస్ 2 హోస్ట్ నానికి 7 నుంచి 8కోట్ల వరకు పారితోషికం దక్కినట్లు ఇన్ సైడ్ టాక్. వీరికంటే తక్కువ ఫీజు తీసుకొని మూడవ సీజన్ ని నాగ్ విజయవంతం చేశాడు. మరి నెక్స్ట్ మెగాస్టార్ అంటున్నారు. ఆయన రేంజ్ కి తగ్గట్టు ఇస్తే గనుక బిగ్ బాస్ పారితోషికం క్యాటగిరీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ అయినట్లే .