నానిపై సంచలన కామెంట్ చేసిన నాగార్జున


Nagarjuna sensational comments on nani

హీరో నానిపై సంచలన కామెంట్ చేసి షాక్ ఇచ్చాడు నాగార్జున . నాని కి పెద్ద జబ్బు ఉందని నిత్యం సెల్ ఫోన్ తోనే ఉంటాడని , పక్కన ఉన్నవాళ్లని పట్టించుకున్న పాపాన పోలేదని అంటున్నాడు నాగార్జున . ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించిన చిత్రం ” దేవదాస్ ”. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున – నాని కాంబినేషన్ లో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఈ దేవదాస్ . ఆ దేవదాస్ చిత్రం ప్రేమ , విషాద కథ కాగా మా సినిమా పూర్తిగా వినోదభరితంగా ఉంటుందని అంటున్నాడు నాగార్జున .

ఇక నాని విషయానికి వస్తే నిత్యం సెల్ ఫోన్ తో ఉంటూ పక్కన ఎవరున్నారు ? ఏంటి ? అనే విషయాలను పట్టించుకోడని అందమైన హీరోయిన్ ఉన్నప్పటికీ సెల్ ఫోన్ తోనే గడుపుతాడని అది చాలా డేంజర్ అని అంటున్నాడు నాగార్జున . ఇక అతడికి సలహా ఇద్దామనుకున్నాను కానీ ఇవ్వలేదు అతడిష్టం అతడిది , అయితే సెల్ ఫోన్ విషయం పక్కనపెడితే మిగతా విషయాలలో నాని చాలా బెటర్ అని కితాబునిస్తున్నాడు నాగ్ . నాని లాగే ఈ సొసైటీ లో సెల్ ఫోన్ కు బానిస అయ్యారు చాలామంది . ఆ విషయంలో జాగ్రత్త పడకపోతే కష్టమే ! ఇక సినిమా విషయానికి వస్తే …….. …… నాని సరసన రష్మిక మందన్న , నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ నటించింది .

English Title: Nagarjuna sensational comments on nani