నాగార్జున కు షాక్ ఇచ్చిన సమంత


మామ అక్కినేని నాగార్జున కు షాక్ ఇచ్చింది కోడలు సమంత . నాగ్ కు సమంత షాక్ ఇవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా ? నాగార్జున రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో పూర్తిగా విబేధిస్తున్నాడు అలాగే జగన్ కు బహిరంగంగానే మద్దతు ప్రకటించాడు కూడా . పైగా ఇద్దరూ మంచి స్నేహితులు కూడా కానీ అలాంటిది సమంత మాత్రం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండని ప్రచారం చేస్తోంది .

రేపల్లె తెలుగుదేశం అభ్యర్థి సత్య ప్రసాద్ ని భారీ మెజారిటీ తో గెలిపించండి అంటూ ప్రచారం చేసింది సమంత . అతడికే సమంత మద్దతు ఎందుకు ఇస్తుందో కూడా తెలియజేసింది . సత్యప్రసాద్ సమంత ఫ్యామిలీ ఫ్రెండ్ అంట అలాగే సత్యప్రసాద్ సోదరి డాక్టర్ మంజుల కూడా సమంత కు బెస్ట్ ఫ్రెండ్ దాంతో సత్యప్రసాద్ విజయం కోసం కృషి చేస్తోంది . అయితే నాగార్జున మాత్రం తన పూర్తి మద్దతు జగన్ పార్టీ కే ఇస్తున్నాడు . రాజకీయం అంటే ఇదే ! ఒకే కుటుంబంలో ఒకరు ఒకరికి మద్దతుగా ఉంటే మరొకరు ఇంకొకరికి మద్దతు గా ఉంటున్నారు .