రేయ్ ….. ఎన్టీఆర్ ని చూసి నేర్చుకో

Nagarjuna shocking comments on akhil and ntr రేయ్ …… అఖిల్  ఎన్టీఆర్ ని చూసి మాస్ అంటే ఏంటో నేర్చుకో అంటూ అక్కినేని అభిమానుల ముందు అన్నాడు కింగ్ నాగార్జున . నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ వేడుక జరిగిన విషయం తెలిసిందే . కాగా ఆ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అథితిగా వచ్చాడు . ఎన్టీఆర్ అంటే మాస్ అన్న విషయం తెలిసిందే . మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎన్టీఆర్ అందుకే ఎన్టీఆర్ ని చూసి మాస్ హీరోగా ఎలా ఆకట్టుకోవాలో  చూసి నేర్చుకో అంటూ సలహా ఇచ్చాడు అఖిల్ కు .

అక్కినేని హీరోలు మొదటి నుండి ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోగా నందమూరి హీరోలు మాత్రం మాస్ ని అలరించే చిత్రాలతో ఆకట్టుకున్నారు దాంతో అక్కినేని అంటే క్లాస్ , నందమూరి అంటే మాస్ అని ఫిక్స్ అయిపొయింది . అయితే అక్కినేని హీరోలు మాస్ చిత్రాలు చేస్తున్నప్పటికీ వాళ్లకు మాస్ ఇమేజ్ మాత్రం రావడం లేదు అలాగే నందమూరి హీరోలు ప్రేమ కథా చిత్రాలు చేయాలనీ చూస్తున్నా క్లాస్ ఇమేజ్ రావడం లేదు మరి .

English Title: Nagarjuna shocking comments on akhil and ntr