ప్లాప్ సినిమా కోసం ప్రయాసపడుతున్న నాగార్జున


Nagarjuna support to flop movie

దేవదాస్ సెప్టెంబర్ 27న విడుదలైంది , అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ లభించలేదు కాకపోతే నాగార్జున నాని ల కాంబినేషన్ కాబట్టి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆ వసూళ్లు బయ్యర్లకు సేఫ్ జోన్ లోకి తీసుకురాలేకపోయాయి. 36 కోట్ల బిజినెస్ కాగా ఇప్పటివరకు 22 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. టోటల్ గా 41 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే బయ్యర్లు లాభాలలోకి రావాలంటే మరో 14 కోట్ల షేర్ రావాలి కానీ ఆ షేర్ మాత్రం వచ్చేలా లేదు దాంతో మరోసారి నాగార్జున చేత దేవదాస్ ప్రెస్ మీట్ పెట్టించారు ఆ చిత్ర బృందం. భార్య అమల, పిల్లలు నాగచైతన్య, అఖిల్ , కోడలు సమంత తో కలిసి విదేశాలకు వెళ్లొచ్చిన నాగ్ నిర్మాత అశ్వనీదత్ కోరిక మేరకు ప్రెస్ మీట్ పెట్టాడు.

దాదాపుగా బయ్యర్ల ని ముంచిన దేవదాస్ సినిమా కోసం బాగానే ప్రయాస పడుతున్నాడు నాగార్జున. ఇప్పటి వరకు చాలాసార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు నాగార్జున. ఒక అగ్ర హీరో ఇన్నిసార్లు ఒక సినిమా కోసం మీడియా ముందుకు రావడం అరుదు కానీ నాగార్జున మాత్రం దేవదాస్ కోసం తెగ కష్టపడుతున్నాడు. అయిన పోయిన సినిమా కోసం ఎంతగా కష్టపడినా ప్రయోజనం ఏముంటుంది శ్రమ తప్ప. నిన్న విడుదలైన నోటా చిత్రానికి ప్లాప్ టాక్ రావడంతో దేవదాస్ బ్రేక్ ఈవెన్ కావడానికి ఇంతగా శ్రమ పడుతున్నారు. అయితే నాగ్ శ్రమ వృధా అవడం తప్ప మరో ప్రయోజనం అయితే కనిపించడం లేదు.

English Title: Nagarjuna support to flop movie