నాగార్జున సంచలన నిర్ణయం

Nagarjuna supports to jagan in AP elections
Nagarjuna

కింగ్ నాగార్జున సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు కథనాలు వస్తున్నాయి అయితే నాగార్జున బిజినెస్ మైండ్ కాబట్టి అలా చేయకపోవచ్చు అని కూడా వినబడుతోంది . ఇంతకీ నాగార్జున తీసుకోనున్న సంచలన నిర్ణయం ఏంటో తెలుసా ……. వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయడమే కాకుండా పోటీ కూడా చేస్తాడని అంటున్నారు . జగన్ కు నాగార్జున కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి .

అలాగే ఆర్ధిక పరమైన లావాదేవీలు కూడా ఉన్నాయి అందుకే జగన్ జైలులో ఉన్నపుడు వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసాడు కూడా . అంతేకాదు 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో తప్పకుండా జగన్ గెలుస్తాడని ముఖ్యమంత్రి అవుతాడని అనుకున్నాడు కానీ సీన్ రివర్స్ అయ్యింది కట్ చేస్తే ఇప్పుడు 2019 లో మాత్రం తప్పకుండా జగన్ ముఖ్యమంత్రి అవుతాడని , అందుకే జగన్ తరుపున ప్రచారం చేయడమే కాకుండా ఎన్నికల్లో పోటీ కూడా చేయాలనీ ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది . అయితే నాగార్జున బిజినెస్ మెన్ కాబట్టి జగన్ కు మద్దతు ఇస్తాడేమో కానీ పోటీ మాత్రం చేయడని అంటున్నారు . అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతోందో తెలీదు కదా ! ఏమో ! గుర్రం ఎగరా వచ్చు .

English Title: Nagarjuna supports to jagan in AP elections