బిగ్ బాస్ లో నాగ్ బంగార్రాజు హడావిడి

BIGG BOSS 3 Telugu
BIGG BOSS 3 Telugu

వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో కొన్ని ఆనవాయితీ ప్రకారం జరుగుతాయి. అందులో భాగంగా ప్రతీ సీజన్ లో ఒకసారి హోస్ట్ గా ఉన్న వ్యక్తి బిగ్ బాస్ హౌజ్ లోకి ప్రవేశించి కంటెస్టెంట్స్ తో సరదాగా గడిపేసి వెళ్లిపోతుంటారు. మొదటి సీజన్ లో ఎన్టీఆర్ వచ్చి అందరికీ వండిపెట్టారు. సెకండ్ సీజన్ లో నాని వచ్చి అందరితో కబుర్లు చెప్పి ఎవరి స్ట్రెంగ్త్స్ ఏంటో చెప్పి హౌజ్ మేట్స్ ను మోటివేట్ చేసి వెళ్ళాడు.

ఈసారి థర్డ్ సీజన్ లో నాగార్జున వంతు వచ్చింది. దసరా సందర్భంగా నాగ్ ఈరోజు హౌజ్ లోకి అడుగుపెట్టనున్నాడు. తనకు ఎంతో నచ్చిన బంగార్రాజు పాత్రలో నాగార్జున హౌజ్ లో సందడి చేయనున్నాడు. అంతే కాకుండా హౌజ్ మేట్స్ అందరి చేత డిఫరెంట్ గేమ్స్ ఆడించి, డ్యాన్స్ చేయించి, వివిధ రకాలుగా ఎంటర్టైన్ చేయనున్నాడు.

దీనికి సంబందించిన ప్రోమో కొద్దిసేపటిక్రితం విడుదలైంది. కచ్చితంగా ఈ ఎపిసోడ్ ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేస్తుందని ప్రోమో చూస్తుంటేనే అర్ధమైపోతుంది. సినిమాల పరంగా కూడా నాగ్ బంగార్రాజు చిత్రంలో నటించాలని చూస్తున్నాడు. బిగ్ బాస్ పూర్తవ్వగానే ఈ చిత్రం మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన విశేషాలేమైనా నాగార్జున బిగ్ బాస్ లో పంచుకుంటాడేమో చూడాలి.