సెకండ్ షెడ్యూల్ మొదలుపెట్టడానికి నాగ్ రెడీ

సెకండ్ షెడ్యూల్ మొదలుపెట్టడానికి నాగ్ రెడీ
సెకండ్ షెడ్యూల్ మొదలుపెట్టడానికి నాగ్ రెడీ

కింగ్ అక్కినేని నాగార్జున గతేడాది షూటింగులకు అనుమతులు వచ్చాక మొదటగా బయటకు వచ్చి డేరింగ్ గా వైల్డ్ డాగ్ షూటింగ్ ను మొదలుపెట్టాడు. అందరూ ఇంకా షూటింగ్స్ మొదలుపెట్టడానికి ఆలోచిస్తున్నప్పుడే వైల్డ్ డాగ్ షూటింగ్ ను కూడా పూర్తి చేసాడు. ఈ నేపథ్యంలో మరోసారి నాగ్ ధైర్యం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

వైల్డ్ డాగ్ ఫలితం సంగతి పక్కనపెడితే మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. నాగ్ పెర్ఫార్మన్స్ కు మంచి పేరొచ్చింది. ఇక ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు నాగార్జున. ఇప్పటికే ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేసారు. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.

అయితే తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది నుండి సినిమా షూటింగ్ తిరిగి మొదలవుతుందని తెలుస్తోంది. జూన్ నుండి ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుందిట. నాగ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కూడా స్పై చిత్రమే అని తెలుస్తోంది. గరుడవేగ వంటి సూపర్బ్ మూవీ తర్వాత ప్రవీణ్ నుండి వస్తోన్న సినిమా కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.