నాగ్ వ‌ర్సెస్ కార్తీ.. గెలిచేదెవ‌రు!

Nagarjuna vs Karthi who will win boxoffice war
Nagarjuna vs Karthi who will win boxoffice war

కింగ్ నాగార్జున‌, హీరో కార్తీ 2016లో వ‌చ్చిన `ఊపిరి` చిత్రంలో కలిసి నటించిన విష‌యం తెలిసిందే. ఈ ఎమోష‌న‌ల్ డ్రామా విడుద‌లై ఐదేళ్లు పూర్త‌య్యాయి. ఈ సినిమా చేసిన ద‌గ్గ‌రి నుంచి కార్తీకి, నాగ్‌కి మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింది. అది ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. అయితే తాజాగా వీరిద్ద‌రూ బాక్సాఫీస్ వ‌ద్ద సై అంటే సై అంటున్నారు. కారణం ఈ ఇద్ద‌రూ న‌టించిన చిత్రాలు ఏప్రిల్ 2న పోటీప‌డుతున్నాయి.

కింగ్ నాగార్జున న‌టించిన `వైల్డ్ డాగ్` చిత్రం 2007లో హైద‌రాబాద్‌లో జ‌రిగిన వ‌రుస బాంబ్ బ్లాస్ట్‌ల నేప‌థ్యంలో అత్యంత స‌హ‌జంగా సాగే క‌థ‌. ఎలాంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ లేకుండా.. చివ‌రికి పాట‌లు కూడా లేకుండా ఈ చిత్రాన్ని నిరంజ‌న్‌రెడ్డి నిర్మించారు. అహిషోర్ సాల్మ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ మూవీ ఏప్రిల్ 2న విడుద‌ల కాబోతోంది. ఇదే రోజు కార్తీ న‌టించిన `సుల్తాన్‌` రిలీజ్ అవుతోంది.

`వైల్డ్ డాగ్‌`తో పోలిస్తే క‌మ‌ర్షియ‌ల్ అంశాల మెండుగా వున్న చిత్ర‌మిది. పైగా వంద మంది రౌడీల‌కు  అండ‌గా నిల‌బ‌డే ఓ యువ‌కుడు త‌న ప్రేమ కోసం ఏం చేశాడ‌న్న‌దే ఇందులో ఆస‌క్తిక‌రం. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించింది. కార్తీని ఆడుకుంటున్న తీరు మాస్‌తో పాటు క్లాస్ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకునేలా వుంది. చాలా రోజుల త‌రువాత నాగార్జున ప‌వ‌ర్‌ఫుల్ కాప్‌గా రియ‌లిస్టిక్ మూవీలో న‌టించ‌డం, హైద‌రాబాద్ బాంబు పేళుళ్ల వెన‌క ఎవ‌రున్నార‌నే ఆస‌క్తిక‌ర క‌థ‌నంతో రూపొందిన చిత్రం కావ‌డంతో ఈ మూవీపై కూడా భారీ అంచ‌నాలే వున్నాయి. వైల్డ్ డాగ్‌, సుల్తాన్ దేనిక‌దే ప్ర‌త్యేక‌త‌తో రూపొందాయి. మ‌రి ఈ ఇద్ద‌రు హీరోల్లో బాక్సాఫీస్ వ‌ద్ద గెలిచేది ఎవ‌ర‌న్న‌ది తెలియాలంటే ఏప్రిల్ 2 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.