వెంకీ కిస్ ఇచ్చి, నాగ్ హగ్ చేసుకుని ఎమోషనల్ అయిపోయి…


Nagarjuna Venkatesh praises Syeraa and Chiranjeevi
Nagarjuna Venkatesh praises Syeraa and Chiranjeevi

బయట హీరోల ఫ్యాన్ వార్స్ అంటూ ఒకరి మీద ఒకరు ట్రోలింగ్ చేసుకోవడం లాంటివి తరచుగా జరుగుతుంటాయి. హీరోలు ఎంతలా మేము బానే ఉంటాం మీరు గొడవలు పడకండి అని చెప్తున్నా ఈ ఫ్యాన్ వార్స్ మాత్రం తగ్గవు. అయితే ఎప్పటికప్పుడు హీరోలు ఎంతక్లోజ్ గా ఉంటారనేది, ఒకరి సక్సెస్ ను మరొకరు ఎంతలా ఎంజాయ్ చేస్తారనేది కొన్ని ఉదాహరణలు మనం చూస్తూనే ఉన్నాం.

రీసెంట్ గా చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అటు సమీక్షకులు, ఇటు ప్రేక్షకులు ఈ చిత్రానికి మంచి రేటింగ్, రివ్యూలు ఇచ్చారు. ఇటీవలే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ చిరంజీవిని, రామ్ చరణ్ ని ఇంటర్వ్యూ చేసాడు. అందులో చిరు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

“నేను, నాగార్జున కలిసి సైరా మొదటి రోజు చూసాం. సినిమా అవ్వగానే నాగ్ గట్టిగా హగ్ చేసుకుని ఎమోషనల్ అయిపోయాడు. అతని కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఎంత బాగా చేసావ్. ఎంత మంచి సినిమా అందించావ్ అంటూ ప్రశంసలు కురిపించాడు. అలాగే వెంకటేష్ కూడా సినిమా చూసి ఎక్కడున్నావ్, నిన్ను కలవాలి అంటూ ఫోన్ చేసాడు. పది నిమిషాల్లో ఇంటికి చేరుకున్నాక వెంకీ కూడా గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నాడు. సినిమా అదిరిపోయింది. నిన్ను కలిసి ఈ విషయం చెప్పేదాకా కుదురుగా ఉండలేకపోయా అంటూ ఆనందపడిపోయాడు” అంటూ చెప్పుకొచ్చాడు చిరు.

చిరంజీవి సక్సెస్ ను ఈ సీనియర్ హీరోలిద్దరూ ఎంతలా ఎంజాయ్ చేసారో చిరు వివరించాడు. అలాగే రజినీకాంత్, ఆయన భార్య కూడా ఫోన్ చేసి అభినందించినట్లు తెలిపాడు.