మన్మథుడు 2 సెన్సార్ రిపోర్ట్


Nagarjuna's Manmadhudu 2 censor report
Nagarjuna’s Manmadhudu 2 censor report

అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు 2 సెన్సార్ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తిచేసుకుంది .ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈనెల 9 న విడుదలకు సిద్ధమైంది . కింగ్ నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించగా సీనియర్ నటి లక్ష్మీ కీలక పాత్రలో నటించింది .

17ఏళ్ల క్రితం వచ్చిన మన్మథుడు చిత్రానికి ఈ మన్మథుడు 2 చిత్రానికి సంబంధం లేకపోయినప్పటికీ టైటిల్ మాత్రమే దానికి కొనసాగింపుగా ఉంది అంతే ! అయితే ఈ మన్మథుడు 2 చిత్రంలో రొమాన్స్ ఎక్కువే ఉండనుందట అలాగే కొన్ని బీప్ సౌండ్ డైలాగ్స్ కూడా ఉన్నాయట ! రకుల్ బోల్డ్ గా నటించింది దాంతో యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చారట .