నాగ్ `వైల్డ్ డాగ్‌` థియేట‌ర్ల‌లోకి రావ‌డం లేదా?నాగ్ `వైల్డ్ డాగ్‌` థియేట‌ర్ల‌లోకి రావ‌డం లేదా?
నాగ్ `వైల్డ్ డాగ్‌` థియేట‌ర్ల‌లోకి రావ‌డం లేదా?

కింగ్ నాగార్జున న‌టిస్తున్న తాజా చిత్రం `వైల్డ్ డాగ్‌`. అహిషోర్ సాల్మ‌న్‌ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2009లో హైద‌రాబాద్‌లో జ‌రిగిన వ‌రుస బాంబు పేలుళ్ల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇందులో నాగార్జున ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ ఎన్ ఐ ఏ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ఆయ‌న పాత్ర వుండ‌బోతోంది. ఇందులో స‌యామీఖేర్‌, దియామీర్జా, అలీ రెజా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ని హిమాల‌యాల్లోని మ‌నాలీ కొండ‌ల్లో పూర్తి చేశారు. 21 డేస్ పాటు చిత్రీక‌రించిన పోరాట ఘ‌ట్టాలు ఈ మూవీకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాయ‌ట‌.

ఇదిలా వుంటే ఈ మూవీ ధియేట‌ర్ల‌లో రిలీజ్ కావ‌డం లేద‌ని నేరుగా డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతోంద‌ని తాజా టాక్‌. ఈ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫ‌ర్ ఇచ్చింద‌ట‌. దీనికి నిర్మాత‌లు కూడా ఓకే చెప్పేశార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ధియేట‌ర్లు రీ ఓపెన్ అవుతున్న నేప‌థ్యంలో నాగ్ లాంటి హీరో త‌మ మూవీని డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్ చేయ‌బోతుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇలాంటి నిర్ణ‌యాన్ని నాగ్ లాంటి హీరో స్వాగ‌తిస్తే థియేట‌ర్ల‌కు అన్నాయం చేసిన‌ట్టేన‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.