హాట్ భామ నగ్మా తన పెళ్లి గురించి ఏమందో తెలుసా


Nagma reacts on her marriage 

ఒంటి మీదకు 44 ఏళ్ళు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు నగ్మా . 90 వ దశకంలో తన  గ్లామర్ తో ఓ ఊపు ఊపేసిన భామ ఈ నగ్మా . తెలుగు , తమిళ , హిందీ చిత్రాల్లో నటించిన ఈ భామ భోజ్ పురి లో కూడా నటించింది . భోజ్ పురి చిత్రాల్లో నటించే సమయంలోనే అక్కడి స్టార్ హీరో రవికిషన్ తో జోరుగా ప్రేమాయణం సాగించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి . కట్ చేస్తే ఇద్దరూ పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు .

 

ఇక అప్పటి నుండి సినిమాలు మానేసి రాజకీయాల్లో తిరుగుతోంది నగ్మా . తాజాగా తన పెళ్లి గురించి మాట్లాడింది ఈ భామ . నా జీవితంలో పెళ్లి అనేది రాసి పెట్టిఉంటే తప్పకుండా జరిగి తీరుతుంది , ఏది ఎప్పుడు కావాలో ఆ దేవుడు రాసి పెట్టి ఉంటాడు అలాగే జరుగుతుంది . నా వరకు అయితే పెళ్ళికి నేను వ్యతిరేకం కాదు అని అంటోంది నగ్మా . పెళ్ళికి వ్యతిరేకం కాదంటోంది కానీ పెళ్లి గురించి ఏమైనా ప్రయత్నాలు చేస్తే కదా ! జరిగేది .

 

English Title: Nagma reacts on her marriage