జ‌య‌ప్ర‌ద‌కు న‌గ్మ స్ట్రాంగ్ కౌంట‌ర్‌!


జ‌య‌ప్ర‌ద‌కు న‌గ్మ స్ట్రాంగ్ కౌంట‌ర్‌!
జ‌య‌ప్ర‌ద‌కు న‌గ్మ స్ట్రాంగ్ కౌంట‌ర్‌!

సుశాంత్ సింగ్ అనుమానాస్ప‌ద మృతి బాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ కేసుకి డ్ర‌గ్స్‌కి సంబంధం వుంద‌ని తేల‌డంతో నార్కోటిక్స్ డ్ర‌గ్ కంట్రోల్ బోర్డ్ రంగంలోకి దిగింది. రియాని విచారించి ప‌లు షాకింగ్ విష‌యాల్ని రాబ‌ట్టి న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోందే కానీ ఈ కేసుకి సంబంధించి ఎలాంటి విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. సుశాంత్ నిజంగానే ఆత్మ హ‌త్య చేసుకున్నాడా? ఆ అవ‌స‌రం వుందా? అనే విష‌యాల్ని మాత్రం బ‌య‌ట‌పెట్ట‌డం లేదు.

సుశాంత్ మృతి అంతా కీల‌క మ‌లుపులు తిరిగి చివ‌రికి డ్ర‌గ్స్ వ‌ద్ద ఆగిపోయిన‌ట్టు తెలుస్తోంది. దీంతో బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ సంస్కృతి పెరిగిపోయింద‌ని, బాలీవుడ్ అంటేనే డ్ర‌గ్స్ అన్న స్థాయిలో చ‌ర్చ‌మొద‌లైంది. పార్ల‌మెంట్ సాక్షిగా న‌టుడు, బీజేపీ ఎంపీ ర‌వికిష‌న్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారాన్ని రేపాయి. దీనిపై జ‌యాబ‌చ్చ‌న్ ఘాటుగా స్పందించింది. బాలీవుడ్‌పై బుర‌ద‌జ‌ల్లే కార్య‌క్ర‌మం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. దీనికి వెంట‌నే వెట‌ర‌న్ న‌టి, బీజేపీ ఎంపీ జ‌య‌ప్ర‌ద స్పందించారు.

జ‌యాబ‌చ్చ‌న్ ఎందుకింత‌గా కంగారు ప‌డుతున్నారో అర్థం కావ‌డం లేద‌ని, దీన్ని రాజ‌కీయం ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేద‌ని కౌంట‌రిచ్చారు. అయితే జ‌య‌ప్ర‌ద వ్యాఖ్య‌ల‌కు కాంగ్రెస్ నేత‌, న‌టి నగ్మ గ‌ట్టి కౌంట‌రిచ్చారు. సీబీఐ,ఎన్‌సీబి, ఈడీ సుశాంత్ కేసుని విచారిస్తున్నాయి. సుశాంత్ కేసులో చాలా రోజులుగా విచార‌ణ జ‌రుగుతోంది. కానీ ఇంత వ‌ర‌కు ఏం జ‌రిగిందో మాత్రం బ‌య‌టికి రావ‌డం లేదు. దీన్ని క‌వ‌ర్ చేసుకోవ‌డం కోస‌మే బీజేపీ స‌భ్యులు స‌డ‌న్‌గా బాలీవుడ్ లో డ్ర‌గ్స్ అంటూ విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌ని, బాలీవుడ్‌తో పాటు ఎంటైర్ నేష‌న్ సుశాంత్ కేసుని నిషితంగా గ‌మ‌నిస్తోంద‌ని ఘాటుగా స్పందించారు.